Vijay Deverakonda : వైజాగ్‌లో ఫ్యాన్స్ మీట్ పెట్టిన విజయ్ దేవరకొండ.. భారీగా తరలివచ్చిన అభిమానులు..

తాజాగా విజయ్ దేవరకొండ వైజాగ్ లో తన అభిమానులతో ఓ స్పెషల్ మీట్ ఏర్పాటు చేసాడు.

Vijay Deverakonda : విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమా తర్వాత ఇప్పుడు మూడు పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. మూడు డిఫరెంట్ కథలు, భారీ బడ్జెట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు త్వరలో రాబోతున్నాడు విజయ్. ఇటీవల విజయ్ పుట్టిన రోజుకి ఈ మూడు సినిమాల అప్డేట్స్ ఇవ్వడంతో అభిమానులు ఈ సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు.

Also Read : Ananya Nagalla : ఓ రేంజ్‌లో కర్రసాము చేస్తున్న అనన్య నాగళ్ళ.. వీడియో వైరల్..

ప్రస్తుతం విజయ్ దేవరకొండ VD12 సినిమా షూట్ లో ఉన్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ వైజాగ్ లో జరుగుతుంది. గత రెండు వారాలుగా ఈ సినిమా వైజాగ్ లో షూట్ జరుపుకుంటుంది. స్పై థ్రిల్లర్ జానర్ లో ఈ సినిమా తెరకెక్కుతుందని సమాచారం. తాజాగా విజయ్ దేవరకొండ వైజాగ్ లో తన అభిమానులతో ఓ స్పెషల్ మీట్ ఏర్పాటు చేసాడు.

 

వైజాగ్ లో ఉన్న తన అభిమానులను స్వయంగా వెళ్లి కలిసాడు విజయ్. వైజాగ్ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ఫ్యాన్స్ మీట్ జరగ్గా విజయ్ వెళ్లి అక్కడున్న అభిమానులందరిని కలిసి, అందరికి ఫోటోలు ఇచ్చాడు. ఇక అభిమానులు పూల వర్షం కురిపిస్తూ విజయ్ కి గ్రాండ్ వెల్కమ్ ఇచ్చారు. ఫ్యాన్స్ ని ఉద్దేశించి విజయ్ మాట్లాడాడు. దీంతో ఈ ఫ్యాన్స్ మీట్ కి చెందిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. విజయ్ తో ఫోటోలు దిగిన అభిమానులు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సంతోషం వ్యక్తపరుస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు