Adipurush : ఆదిపురుష్ హనుమాన్ డైలాగ్స్ పై వివాదం.. నేనేమి తప్పుగా రాయలేదు అంటూ స్పందించిన రైటర్..

ఈ సినిమాలో ఆంజనేయస్వామి క్యారెక్టర్ తో మాట్లాడించిన మాటలు, వేరే వాళ్ళు హనుమంతుడితో మాట్లాడిన మాటలు కొన్ని తప్పుగా ఉన్నాయని, మాట్లాడే విధానం, డైలాగ్స్ కూడా తప్పుగా ఉన్నాయని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై పెద్ద వివాదమే చెలరేగుతుంది.

Controversy over Adipurush Hanuman dialogues Writer Manoj muntashir clarifies on it

Adipurush Dialogues :  ప్రభాస్(Prabhas), కృతి సనన్(Kriti Sanon) జంటగా రామాయణం(Ramayanam) ఆధారంగా తెరకెక్కిన సినిమా ఆదిపురుష్ నిన్న జూన్ 16న థియేటర్స్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో సైఫ్ అలీఖాన్(Saif Alikhan) రావణాసురుడిగా నటించాడు. ముందు నుంచి సినిమాపై ఎన్నో హోప్స్ ఉండగా సినిమా అరిలిజ్ అయ్యాక మాత్రం భారీగా విమర్శలు వచ్చాయి. రామాయణం అని చెప్పి, ప్రమోషన్ చేయడంతో మరోసారి రామాయణం చూస్తామని ఎంతో ఆశగా జనాలు థియేటర్స్ కి వెళ్తే రామాయణంలో వాళ్లకు ఇష్టమొచ్చినవన్ని పెట్టేసి పూర్తిగా మార్చేశారని ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు.

రామాయణంలోని పాత్రల స్వరూపాలు మాత్రమే కాదు డైలాగ్స్, విజువల్స్ అన్ని కూడా మార్చేశారని సోషల్ మీడియా వేదికగా ఆదిపురుష్ యూనిట్ పై, డైరెక్టర్ పై ఫైర్ అవుతున్నారు నెటిజన్లు, ప్రేక్షకులు. ఇక పలువురు ఆదిపురుష్ సినిమాపై కేసులు కూడా ఫైల్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఆంజనేయస్వామి క్యారెక్టర్ తో మాట్లాడించిన మాటలు, వేరే వాళ్ళు హనుమంతుడితో మాట్లాడిన మాటలు కొన్ని తప్పుగా ఉన్నాయని, మాట్లాడే విధానం, డైలాగ్స్ కూడా తప్పుగా ఉన్నాయని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై పెద్ద వివాదమే చెలరేగుతుంది. పలువురు రాజకీయ నాయకులు కూడా దీనిపై విమర్శలు చేస్తున్నారు. తాజాగా దీనిపై ఆదిపురుష్ మాటల రచయిత స్పందించాడు.

Adipurush : ఆదిపురుష్ పై దారుణమైన ట్రోల్స్.. ముఖ్యంగా డైరెక్టర్ ఓంరౌత్ పై..

ఆదిపురుష్ మాటల రచయిత మనోజ్ ముంతాషీర్ శుక్ల మాట్లాడుతూ.. నేనేమి తప్పుగా రాయలేదు. ఎంతో శ్రద్దగానే హనుమంతుడి సంభాషణలు రాశాను. చాలా ఆలోచించి రాశాను. అందరూ ఒకేలా మాట్లాడారు. పాత్రల మధ్య వ్యత్యాసం కోసం డైలాగ్స్ ని అలా రాశాను. అలాంటి డైలాగ్స్ ని మొదటి సారి నేనేమి రాయలేదు. నా కంటే చాలా మంది రాశారు. కొంతమంది జానపద కళాకారులు రామాయణం చెప్పేటప్పుడు ఆయన సంభాషణలు ఇలాగే చెప్పేవారు. నేను వాటిని పరిగణలోకి తీసుకొని సినిమాలో డైలాగ్స్ రాశాను అని అన్నారు. అయినా కూడా ఈ డైలాగ్స్ పై ముఖ్యంగా నార్త్ లో పెద్ద వివాదమే జరుగుతుంది.

ట్రెండింగ్ వార్తలు