Radhe Shyam: ట్రైలర్‌తో కౌంట్‌డౌన్ స్టార్.. వారం రోజుల పాటు ప్రమోషన్ ఈవెంట్స్!

గతంలో విడుదల చేసిన ట్రైలర్ కాకుండా మరో షార్ట్ యాక్షన్ ట్రైలర్ వీడియోతో మరోసారి అట్రాక్ట్ చేశాడు రాధేశ్యామ్. మార్చ్ 11నే రిలీజ్.. ఎక్కువ టైమ్ లేదు.. అటు భీమ్లానాయక్ తర్వాత..

Radhe Shyam: గతంలో విడుదల చేసిన ట్రైలర్ కాకుండా మరో షార్ట్ యాక్షన్ ట్రైలర్ వీడియోతో మరోసారి అట్రాక్ట్ చేశాడు రాధేశ్యామ్. మార్చ్ 11నే రిలీజ్.. ఎక్కువ టైమ్ లేదు.. అటు భీమ్లానాయక్ తర్వాత రాబోతున్న సినిమా.. అదీ పాన్ ఇండియా లెవెల్ లో.. అందుకే తగ్గేదే లే అంటూ బరిలోకి దూకబోతున్నాడు రాధేశ్యామ్. మరోసారి ప్రమోషన్ మెటీరియల్ తో సందడి చేస్తోంది రాధేశ్యామ్.

Radhe Shyam Release Trailer: ప్రేమకి విధికి మధ్య జరిగిన యుద్ధమే రాధేశ్యామ్!

సంక్రాంతి వాయిదా తర్వాత కాస్త సైలెంటయిన మేకర్స్.. ప్రమోషన్ హడావిడీని స్టార్ట్ చేశారు. వాలంటైన్స్ డేకు స్పెషల్ లవబుల్ టీజర్.. మొన్న అమితాబ్ వాయిస్ ఓవర్ అందించారనే అప్ డేట్.. రీసెంట్ గా ఈ రాతలే వీడియో వర్షన్.. ఇప్పుడు మరో యాక్షన్ ట్రైలర్ ఇలా కాస్త హెడ్ లైన్స్ లో నిలిచేలా ప్లాన్ చేస్తున్నారు. ఒకపక్క సినిమా అప్డేట్స్ తో పాటు లైవ్ ప్రమోషన్ కార్యక్రమాలకు కూడా రాధేశ్యామ్ టీమ్ షెడ్యూల్ చేసేసింది.

Radhe Shyam: థియేటర్స్‌లో ఆస్ట్రాలజీ కౌంటర్.. వాట్ యాన్ ఐడియా!

ముందుగా మార్చి 2న మరో ట్రైలర్ లాంచ్ చేసిన యూనిట్ ఇందుకోసం ముంబైలో ఓ ఈవెంట్ నిర్వహించింది. ఆ తర్వాత మార్చి 3న హిందీలో షోస్, ఇంటర్వ్యూస్ ప్లాన్ చేసిన యూనిట్ మార్చి 4న మరో దక్షణాది రాష్ట్రమైన తమిళనాడులో ఈవెంట్ ప్లాన్ చేసింది. చెన్నైలో భారీ ఎత్తున ఈ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఆ తర్వాత మార్చి 6-7 తేదీలలో తెలుగులో ప్రమోషన్ ఈవెంట్ నిర్వహించనున్న రాధేశ్యామ్ టీమ్.. మార్చి 8న కేరళలో, మార్చి 9న ఢిల్లీ, మార్చి 10న మరోసారి హిందీలో ప్రమోషన్ నిర్వహించేలా ప్లాన్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు