Covid Patient : శ్మశాన వాటికల్లో అదనపు వసూళ్లకు చెక్‌…ధరల పట్టిక ప్రదర్శన

కరోనా వేళ సహాయం చేయాల్సింది పోయి..అందినకాడికి దోచుకుంటున్నారు. ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి చనిపోతే..శ్మశానం వరకు కాసుల వేట కొనసాగిస్తున్నారు. తమ వారిని కోల్పోయి పుట్టెడు దు:ఖంలో ఉన్నా..సరే..ఇంతియాల్సిందే అంటూ మంకు పడుతున్నారు కొంతమంది శ్మశాన వాటికల వాళ్లు.

Covid Patient Funeral : కరోనా వేళ సహాయం చేయాల్సింది పోయి..అందినకాడికి దోచుకుంటున్నారు. ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి చనిపోతే..శ్మశానం వరకు కాసుల వేట కొనసాగిస్తున్నారు. తమ వారిని కోల్పోయి పుట్టెడు దు:ఖంలో ఉన్నా..సరే..ఇంతియాల్సిందే అంటూ మంకు పడుతున్నారు కొంతమంది శ్మశాన వాటికల వాళ్లు. కాసులు దండుకొనే వారికి చెక్ పెట్టాలని జీహెచ్ఎంసీ భావించింది.

అంతిమ సంస్కారానికి గరిష్టంగా రూ. 8 వేలు మాత్రమే తీసుకోవాలని ఆదేశించింది. ఎలక్ట్రిక్‌ దహనం అయితే రూ.4000లు చెల్లించాలని సూచిస్తున్నది. అంతేగాకుండా..పలు శ్మశాన వాటికల్లో ధరల పట్టికల ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. అయినా..అధిక ఛార్జీలు ఎవరైనా వసూలు చేస్తే…టోల్ ప్రీ నెంబర్ ద్వారా కంప్లైట్ చేయాలని సూచించింది.

కోవిడ్ ద్వారా చనిపోయిన వారి అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబీకులు అష్టకష్టాలు పడుతున్నారు. శ్మశాన వాటికల్లో అడ్డగోలుగా దోచుకుంటున్నారు కొంతమంది. రూ. 8 వేలు మాత్రమే తీసుకోవాల్సి ఉంటే..కొంతమంది కాటికాపరులు రూ. 12 వేల నుంచి రూ. 16 వేల వరకు బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు గుప్పుమన్నాయి.

ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం..జోనల్ కమీషనర్లు అకస్మిక పర్యటనలు చేసి దహన సంస్కారాలకు సంబంధించి..ఛార్జీల పట్టికలను ఏర్పాటు చేశారు. కాటికాపరులకు బిల్లు బుక్కులు అందచేశారు. అధిక ఛార్జీలు వసూలు చేసినా..ఇతర ఫిర్యాదుల కోసం 040-2111 1111 కు కాల్ చేయాలని జీహెచ్ఎంసీ అధికారులు ప్రజలకు సూచించారు.

Read More : Hyderabad Lockdown : ఫుడ్ డెలివరీ బాయ్స్‌కు లైన్ క్లియర్!

ట్రెండింగ్ వార్తలు