Yamuna River : ఈ రాత్రికి ఢిల్లీ మునిగిపోతుందా? అత్యంత భయానకంగా యమునా నది ప్రవాహం

Yamuna River : యమునా నది వరద ప్రవాహం ఆల్ టైమ్ రికార్డ్ ఎత్తుకు చేరుకుంది.

River Yamuna – Delhi : దేశ రాజధాని ఢిల్లీ వరదల్లో చిక్కుకుంది. ఢిల్లీకి డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. యమునా నది ప్రవాహం అత్యంత భయానకంగా ఉంది. యుమునా నదిలో వరద ప్రవాహం డేంజర్ స్థాయిని దాటింది. ప్రస్తుతం యుమన నీటి మట్టం 208.05 మీటర్లకు చేరుకుంది. ఈ పరిస్థితుల్లో గురువారం ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ సమావేశాన్ని ఎల్జీ వీకే సక్సేనా ఏర్పాటు చేశారు.

ఢిల్లీలో వరదల పరిస్థితిపై సమీక్ష జరపనున్నారు. ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ సమావేశానికి సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. గురువారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత యమునా వరద ప్రవాహంలో తగ్గుదల ఉంటుందని సిడబ్ల్యుసి భావిస్తోంది. ఎగువ రాష్ట్రాల్లో వర్షాలతో 45ఏళ్ల తర్వాత యమునా నది ఉప్పొంగింది. హతిని కుండ్ బ్యారేజీ నుంచి యమునలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.

యమునలో నీటిమట్టం పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇప్పటివరకు 16వేల 564 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో 12 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ఆరు జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉన్నారు. ఉత్తర ఢిల్లీ, ఈశాన్య ఢిల్లీ, షహదారా, సెంట్రల్ ఢిల్లీ, తూర్పు ఢిల్లీ ,సౌత్-ఈస్ట్ ఢిల్లీలో యమునా నది వరద ప్రభావం ఉంది. వరద పరిస్థితులు ఎదుర్కునేందుకు ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్, NDRF, ఢిల్లీ పోలీసులు, సివిల్ డిఫెన్స్ వాలంటీర్లు రెడీగా ఉన్నారు.

Also Read..Khiladi Lady Rasheeda : అటువంటి మగవాళ్లే టార్గెట్, నాలుగు రాష్ట్రాల్లో 8 పెళ్లిళ్లు చేసుకున్న యువతి

ఢిల్లీ ఔటర్ రింగ్ రోడ్ల పైకి భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద ప్రభావిత మార్గాల్లో ట్రాఫిక్ అడ్వయిజరి జారీ చేశారు ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు. మరోవైపు యమునా నది వరద ప్రవాహం ఆల్ టైమ్ రికార్డ్ ఎత్తుకు చేరుకుంది.

రాత్రి 10 గంటల సమయానికి యుమునా నదిమట్టం 208.05 మీటర్లకు చేరింది.
ఇప్పటివరకు 1978లో నమోదైన 207.49 మీటర్లే గరిష్ట స్థాయి. వరద కారణంగా పలు రహదారులు, కాలనీలు నీట మునిగాయి. మరోవైపు లోతట్టు ప్రాంతాల్లోని 10 పాఠశాలలకు సెలవులు ప్రకటించిన ఢిల్లీ ప్రభుత్వం.

ట్రెండింగ్ వార్తలు