Site icon 10TV Telugu

David Miller : టీ20 ఫార్మాట్ కు డేవిడ్ మిల్లర్ రిటైర్మెంట్..? షాకింగ్ విషయం ఏమిటంటే..

David Miller

David Miller

David Miller Retirement Rumors : టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా ఓడిపోయిన విషయం తెలిసిందే. టీమిండియా విజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్ లో ఓటమితో సఫారీ జట్టు ఆటగాళ్లు కన్నీటి పర్యాంతమయ్యారు. చేతికందిన ట్రోఫీ చివరి నిమిషంలో చేజారిపోవడంతో ఆ బాధ వారిని ఇంకా వెంటాడుతూనే ఉంది. మ్యాచ్ చివరిలో సఫారీ జట్టు హిట్టర్ డేవిడ్ మిల్లర్ సూర్యకుమార్ పట్టిన అద్భుత క్యాచ్ కు వెనుదిరగాల్సి వచ్చింది. అయితే, చివరిలో మ్యాచ్ ను గెలిపించడంలో విఫలం కావటంతో డేవిడ్ మిల్లర్ అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికేశాడని మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఈ వార్తలపై డేవిడ్ మిల్లర్ స్పందిస్తూ షాకింగ్ విషయం చెప్పారు.

Also Read : IND vs ZIM : జింబాబ్వేతో టీ20 సిరీస్‌.. శాంస‌న్‌, దూబె, జైస్వాల్‌ల‌కు షాక్.. తొలి రెండు టీ20ల‌కు భార‌త జ‌ట్టులో మార్పులు..

అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు చెప్పినట్లు వస్తున్న వార్తలపై డేవిడ్ మిల్లర్ స్పందించాడు. నేను రిటైర్మెంట్ ప్రకటించినట్లు వస్తున్న కథనాలు తప్పు. నేను టీ20 అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవ్వలేదు అంటూ మిల్లర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాశాడు. టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్ మ్యాచ్ లో విజయం సాధించడంలో విఫలమైనందుకు చాలా బాధగా ఉంది. అయినప్పటికీ జట్టు ఆటతీరు పట్ల గర్వంగా ఉంది. మేము అడ్డంకులను అధిగమించాము. ఇది కొత్త ప్రారంభానికి నాంది కావచ్చు అంటూ మిల్లర్ పేర్కొన్నాడు.

Also Read : Team India : టీమ్ఇండియా ఫ్యూచర్‌ ఎలా ఉండబోతుంది.? ఆ ఇద్దరి తర్వాత నడిపించే నాయకుడు ఎవరు.?

డేవిడ్ మిల్లర్ టీ20 ఫార్మాట్ లో 125 మ్యాచ్ లు ఆడాడు. 140కిపైగా స్ట్రైక్ రేట్ తో 2,437 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, ఏడు ఆఫ్ సెంచరీలు ఉన్నారు. 2017లో బంగ్లాదేశ్ పై 35 బంతుల్లో మిల్లర్ సెంచరీ చేశాడు. తద్వారా క్రికెట్ లో టీ20 ఫార్మాట్ లో దక్షిణాఫ్రికా తరపున అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన బ్యాటర్ గా కూడా అతను నిలిచాడు.

 

 

Exit mobile version