Team India : టీమ్ఇండియా ఫ్యూచర్‌ ఎలా ఉండబోతుంది.? ఆ ఇద్దరి తర్వాత నడిపించే నాయకుడు ఎవరు.?

క్రికెట్‌లో ఎంత పెద్ద బ్యాట్స్‌మెన్‌ అయినా తోప్ బౌలర్‌ అయినా ఏదో ఓ రోజు రిటైర్‌ కావాల్సిందే.

Team India : టీమ్ఇండియా ఫ్యూచర్‌ ఎలా ఉండబోతుంది.? ఆ ఇద్దరి తర్వాత నడిపించే నాయకుడు ఎవరు.?

What will be the future of Team India and who is the next captain

క్రికెట్‌లో ఎంత పెద్ద బ్యాట్స్‌మెన్‌ అయినా తోప్ బౌలర్‌ అయినా ఏదో ఓ రోజు రిటైర్‌ కావాల్సిందే. ఓపిక, బాడీలో స్టామిన ఉన్నంత కాలమే ఫామ్‌లో ఉంటారు క్రికెటర్లు. అన్ని ఫార్మాట్లలో అన్ని సందర్భాల్లో రాణించేందుకు.. కొన్నిసార్లు బాడీ కోఆపరేట్ చేయదు. అలాంటి సమయంలో ఒక్కో ఫార్మాట్ నుంచి క్రికెటర్లు రిటైర్మెంట్ ప్రకటించడం కామన్. కపిల్‌ దేవ్‌ నుంచి జడేజా వరకు.. సచిన్‌ టెండూల్కర్ నుంచి రోహిత్, కోహ్లీ వరకు అందరిదీ అదే సిచ్యువేషన్.

నిజానికి కోహ్లీ, రోహిత్‌ది ఇండియన్‌ క్రికెట్‌లో ఓ శకం. నడిపించే నాయకులుగా.. అవసరమైతే టీమ్‌ను ఆదుకునే ట్రబుల్ షూటర్స్‌గా అన్నింట్లో ఈ ఇద్దరి స్టైలేవేరు. అందుకే సచిన్‌ రిటైర్మెంట్‌ తర్వాత మళ్లీ కోహ్లీ, రోహిత్ టీ20 ఫార్మాట్‌ నుంచి తప్పుకోవడంపై అంతగా చర్చ జరుగుతోంది. వాళ్లకు ఉన్న ఫాలోయింగ్ అలాంటిది. ఒక్కొక్కరిలో ఒక్కో క్వాలిటీ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటుంది. కొందరికి కోహ్లీలో ఉన్న అగ్రెసివ్‌నెస్ నచ్చితే మరికొందరికి రోహిత్‌ డేరింగ్ బ్యాటింగ్ మిస్టర్ కూల్ కెప్టెన్సీ నచ్చుతుంది.

త‌దుప‌రి కెప్టెన్ ఎవ‌రు..?

రోహిత్, కోహ్లీ అందించిన విజయాలు ఫ్యాన్స్‌ ఎప్పటికీ మర్చిపోరు. కానీ ఫ్యూచర్ క్రికెట్ స్టోరీ ఏంటనేదే ఇంట్రెస్టింగ్ టాపిక్ అయింది. టీ20 ఇంటర్నేషనల్‌లో ఏ ప్లేయర్‌ భారత టీమ్‌ను లీడ్ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే టీ20 కెప్టెన్‌లో రేసు చాలామంది ప్లేయర్ల పేర్లు వినిపిస్తున్నాయి. మెయిన్‌గా ఐదుగురు ప్లేయర్లు మాత్రం కెప్టెన్సీ పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది.

IND vs ZIM : ప్ర‌పంచ ఛాంపియ‌న్ల‌తో త‌ల‌ప‌డే జింబాబ్వే జ‌ట్టు ఇదే..

టీ20 టీమ్ కెప్టెన్సీకి హార్దిక్ పాండ్యా గట్టి పోటీదారుగా ఉన్నాడని చెప్పొచ్చు. 2022 టీ20 ప్రపంచకప్ నుంచి రోహిత్ శర్మ ఈ ఫార్మాట్‌కు దూరంగా ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో హార్దిక్ టీమ్ఇండియాకు నాయకత్వం వహించాడు. హార్దిక్ సారథ్యంలో భారత జట్టు 16 టీ20లు ఆడి 10 విజయాలు సాధించింది.

ఇక ఇప్పటికే జింబాబ్వే టూర్‌కు టీమ్ఇండియాను నడిపించిన శుభ్‌మన్‌ గిల్‌ కూడా టీ20 కెప్టెన్‌ రేసులో ఉన్నాడు. త్వరలోనే జింబాబ్వే, భారత్ మధ్య 5 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ సిరీస్‌కు భారత జట్టు కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌ని నియమించారు. గిల్ ఫస్ట్‌టైమ్‌ భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. జింబాబ్వే టూర్‌లో టీమిండియా సాధించే విజయాలకు అనుగుణంగా..కెప్టెన్సీ రేసులో అతను ఎంతదూరంలో ఉన్నాడో డిసైడ్ చేయనుంది.

టీ20 ఇంటర్నేషనల్‌లో చాలా కాలంగా నంబర్ వన్‌ బ్యాట్స్‌మెన్‌గా ఉన్న సూర్యకుమార్ యాదవ్ కూడా కెప్టెన్సీ రేసులో ఉన్నాడు. సూర్యకి ఈ ఫార్మాట్‌ బాగా నచ్చిందని చెప్పవచ్చు. సూర్యకుమార్ 7 టీ20 ఇంటర్నేషనల్స్‌లో భారత జట్టుకు కెప్టెన్‌గా కూడా ఉన్నాడు. ఆ సమయంలో టీమ్ఇండియా 5 మ్యాచ్‌లు గెలిచి 2 ఓడింది.

Hardik Pandya : టీ20ప్ర‌పంచ‌క‌ప్ గెలిచిన భార‌త్.. స్పందించ‌ని హార్దిక్ భార్య‌.. విడాకుల రూమ‌ర్ల‌కు ఆజ్యం..!

టీమ్ఇండియాకు కాబోయే కెప్టెన్‌గా వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్‌ కూడా పోటీలో ఉన్నాడు. 2022లో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ పంత్.. దాదాపు 16 నెలల పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ఐపీఎల్ 2024కి ముందు పంత్ తిరిగి వచ్చాడు. దీని తర్వాత 2024 టీ20 ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. పంత్ కెప్టెన్సీలో భారత జట్టు 5 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడి.. 2 గెలిచి 2 ఓడిపోయింది. ఒక మ్యాచ్ అసంపూర్తిగా ముగిసింది.

హార్దిక్ పాండ్యా, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్.. అయితే ఇండియన్ టీమ్‌ కెప్టెన్సీ రేసులో ముందు వరుసలో ఉన్నారు. త్వరలో కోచ్‌ కూడా మారనుండటంతో.. టీమ్ఇండియా ఫ్యూచర్‌ ఎలా ఉంటుందనేదానిపై ఆసక్తికర చర్చ అయితే జరుగుతోంది.