IND vs ZIM : ప్ర‌పంచ ఛాంపియ‌న్ల‌తో త‌ల‌ప‌డే జింబాబ్వే జ‌ట్టు ఇదే..

స్వదేశంలో భార‌త్‌తో జ‌ర‌గ‌బోయే టీ20 సిరీస్‌కు జింబాబ్వే జ‌ట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు ప్ర‌క‌టించింది.

IND vs ZIM : ప్ర‌పంచ ఛాంపియ‌న్ల‌తో త‌ల‌ప‌డే జింబాబ్వే జ‌ట్టు ఇదే..

Zimbabwe squad for India T20Is announced

India vs Zimbabwe : స్వదేశంలో భార‌త్‌తో జ‌ర‌గ‌బోయే టీ20 సిరీస్‌కు జింబాబ్వే జ‌ట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు ప్ర‌క‌టించింది. 38 ఏళ్ల సికందర్ రజా నాయ‌క‌త్వంలో జింబాబ్వే జ‌ట్టు భార‌త్‌తో త‌ల‌ప‌డ‌నుంది. ఇటీవ‌ల ముగిసిన ఐసీసీ టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024కి జింబాబ్వే అర్హ‌త సాధించ‌డంలో విఫ‌ల‌మైంది. ఈ క్ర‌మంలో జ‌ట్టును పునర్నిర్మించాలని ఆ దేశ క్రికెట్ బోర్డు భావిస్తోంది. ఈ క్ర‌మంలోనే భార‌త్‌తో సిరీస్‌కు యువ ఆట‌గాళ్ల‌ను ఎంపిక చేసింది.

వెస్లీ మాధేవెరే, బ్రాండన్ మవుటా, డియోన్ మైయర్స్, ఇన్నోసెంట్ కైయా, మిల్టన్ శుంబాతో పాటు టెండై చతారాల‌కు చోటు ద‌క్కింది. క్లైవ్ మదాండే, బ్రియాన్ బెన్నెట్, జోనాథన్ కాంప్‌బెల్, వెల్లింగ్టన్ మసకద్జా, తడివానాషే మారుమణి, ఫరాజ్ అక్రమ్‌లు జట్టులో తమ స్థానాలను నిలబెట్టుకోగా.. క్రెయిగ్ ఎర్విన్, సీన్ విలియమ్స్, ర్యాన్ బర్ల్, జాయ్‌లార్డ్ గుంబీ, ఐన్స్లీ నడ్లోవుల పై వేటు ప‌డింది. ఎర్విన్, విలియమ్స్ ల‌ను ఎంపిక ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేద‌ని జింబాబ్వే క్రికెట్ పేర్కొంది.

Hardik Pandya : టీ20ప్ర‌పంచ‌క‌ప్ గెలిచిన భార‌త్.. స్పందించ‌ని హార్దిక్ భార్య‌.. విడాకుల రూమ‌ర్ల‌కు ఆజ్యం..!

భార‌త జ‌ట్టు జింబాబ్వేతో 5 మ్యాచుల టీ20 సిరీస్ ఆడ‌నుంది. జూలై 6 నుండి 14 వరకు ఈ సిరీస్ జ‌ర‌గ‌నుంది. అన్ని మ్యాచులు కూడా హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో జ‌ర‌గ‌నున్నాయి.

భారత సిరీస్‌కు జింబాబ్వే జట్టు :
రజా సికందర్ (కెప్టెన్), అక్రమ్ ఫరాజ్, బెన్నెట్ బ్రియాన్, క్యాంప్‌బెల్ జోనాథన్, చతారా టెండై, జోంగ్వే లూక్, కైయా ఇన్నోసెంట్, మదాండే క్లైవ్, మాధవెరె వెస్లీ, మారుమణి తడివానాషే, మసకద్జా వెల్లింగ్‌టన్, మవుతా బ్రాండన్, ముజరబానీ బ్లెస్సింగ్, నకర్విట్ బ్లెస్సింగ్, నాకర్విట్, నాకర్విట్ , లయన్ మిల్టన్.

Virat Kohli : విరాట్ కోహ్లికి బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ.. టీ20 ప్రపంచకప్ ‘టోర్న‌మెంట్ ఆఫ్ ది టీమ్’ ఇదే..