IND vs ZIM : జింబాబ్వేతో టీ20 సిరీస్.. శాంసన్, దూబె, జైస్వాల్‌లకు షాక్.. తొలి రెండు టీ20లకు భారత జట్టులో మార్పులు..
తొలి రెండు టీ20ల కోసం సంజుశాంసన్, శివమ్ దూబె, యశస్వి జైస్వాల్ స్థానంలో సాయి సుదర్శన్, జితేశ్ శర్మ, హర్షిత్ రాణాలను తీసుకుంటున్నట్లు తాజాగా ప్రకటించింది బీసీసీఐ.

India squad for Zimbabwe T20Is Sudharsan Jitesh Harshit added to squad for 1st 2 T20s
India tour of Zimbabwe : టీ20 ప్రపంచకప్ ముగిసింది. ఎన్నో ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ భారత జట్టు మరోసారి టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడింది. ఇక ఇప్పుడు జింబాబ్వే పర్యటకు సిద్దమవుతోంది టీమ్ఇండియా. జింబాబ్వేతో జరగనున్న 5 మ్యాచుల టీ20 సిరీస్ కోసం ఇప్పటికే భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చింది. గిల్ సారథ్యంలో భారత జట్టు బరిలోకి దిగనుంది.
అయితే.. ప్రస్తుతం ఈ జట్టులో కొన్ని మార్పులను చేసింది. తొలి రెండు టీ20ల కోసం సంజుశాంసన్, శివమ్ దూబె, యశస్వి జైస్వాల్ స్థానంలో సాయి సుదర్శన్, జితేశ్ శర్మ, హర్షిత్ రాణాలను తీసుకుంటున్నట్లు తాజాగా ప్రకటించింది. ఈ ముగ్గురు టీ20 ప్రపంచకప్ స్క్వాడ్‌లో ఉన్నారు. వీరు ప్రస్తుతం తుఫాను కారణంగా బార్బడోస్‌లో చిక్కుకుపోయారు.
వీరు భారత జట్టుతో కలిసి త్వరలోనే స్వదేశానికి రానున్నారు. ఆ తరువాత ఈ ముగ్గురు జింబాబ్వేకు బయలు దేరనున్నారు. వీరు జింబాబ్వేలోని టీమ్ఇండియా బృందంతో కలిసేందుకు సమయం పట్టనుంది. ఈ క్రమంలో తొలి రెండు టీ20లకు వీరి స్థానంలో సుదర్శన్, జితేశ్, హర్షిత్ రాణాలకు ఛాన్స్ ఇచ్చింది బీసీసీఐ.
జూలై 6 నుంచి టీ20 సిరీస్ ఆరంభం కానుంది. జూలై 6, 7, 10, 13, 14 తేదీల్లో మ్యాచ్‌లు జరుగనున్నాయి.
జింబాబ్వేతో తొలి రెండు టీ20లకు భారత జట్టు ఇదే..
శుభమాన్ గిల్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకు సింగ్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, తుషార్ దేశ్‌పాండే, సాయి సుదర్శన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్) , హర్షిత్ రాణా
Rohit Sharma : ఎట్టకేలకు మట్టిని తినడానికి గల కారణాలను చెప్పిన రోహిత్ శర్మ..
టీ20 సిరీస్ షెడ్యూల్ ఇదే..
తొలి టీ20 – జూలై 6న
రెండవ టీ20 – జూలై 7న
మూడవ టీ20 – జూలై 10న
నాలుగో టీ20 – జూలై 13న
ఐదో టీ20 – జూలై 14న
మ్యాచులు అన్నీ కూడా హరారే వేదికగానే జరగనున్నాయి.