Kiran Abbavaram : భారీ పీరియాడిక్ థ్రిల్లర్ పాన్ ఇండియా సినిమాతో కిరణ్ అబ్బవరం.. బడ్జెట్ ఏకంగా..
కిరణ్ అబ్బవరం చివరిసారిగా గత సంవత్సరం రూల్స్ రంజన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
- Saketh U
- Published On : July 3, 2024 / 07:53 AM IST
Kiran Abbavaram Coming with high Budget Pan India Periodic Thriller Movie
Kiran Abbavaram : రాజావారు రాణిగారు, SR కల్యాణమండపం, సమ్మతమే.. లాంటి సినిమాలతో ప్రేక్షకులని మెప్పించిన కిరణ్ అబ్బవరం చివరిసారిగా గత సంవత్సరం రూల్స్ రంజన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా ఆశించినంత ఫలితం రాలేదు. చిన్న గ్యాప్ తీసుకొని త్వరలో మరిన్ని సినిమాలతో రాబోతున్నాడు. ఇటీవలే హీరోయిన్ రహస్య గోరక్ ని నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు.
కొంచెం గ్యాప్ తర్వాత త్వరలో కిరణ్ అబ్బవరం నుంచి భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా రాబోతుంది. శ్రీచక్ర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో గోపాలకృష్ణ నిర్మాణంలో సుజీత్, సందీప్ ఇద్దరు డైరెక్టర్స్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఏకంగా 20 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కిరణ్ కెరీర్లో అత్యధిక బడ్జెట్ సినిమాగా రానుంది. ఈ సినిమాకు కిరణ్ ప్రెజెంటర్ గా కూడా వ్యవహరిస్తున్నాడు.
Also Read : Aha Telugu Indian Idol : ఆహాలో దూసుకుపోతున్న తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3..
ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో ఈ సినిమాను గ్రాండ్ రిలీజ్ చేస్తారని సమాచారం. అయితే ఈ సినిమాని తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా విడుదల చేస్తారని సమాచారం. ఈ సినిమాతో కిరణ్ గ్రాండ్ కంబ్యాక్ ఇవ్వడమే కాక పాన్ ఇండియా హీరో కూడా అవ్వడానికి గట్టిగానే కష్టపడుతున్నాడు.
