Aha Telugu Indian Idol : ఆహాలో దూసుకుపోతున్న తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3..

అదిరిపోయే సాంగ్స్, ఎమోషనల్ మూమెంట్స్, కామెడీతో ఆహాలో తెలుగు ఇండియన్ ఐడల్ 3 దూసుకుపోతుంది.

Aha Telugu Indian Idol : ఆహాలో దూసుకుపోతున్న తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3..

Aha Telugu Indian Idol Sesaon 3 Successfully Going with Interesting Elements

Aha Telugu Indian Idol : ఆహా ఓటీటీలో తెలుగు ఇండియన్ ఐడల్ షో సీజన్ 3 మొదలైన సంగతి తెలిసిందే. ఎంతోమంది సింగర్స్ ని ఆడిషన్ చేసి చివరకు 12 మంది ఫైనల్ కంటెస్టెంట్స్ తో గ్రాండ్ గాలా మొదలుపెట్టారు. ఈ షోని శ్రీరామ చంద్ర హోస్ట్ చేస్తుండగా జడ్జీలుగా థమన్, కార్తీక్, గీతా మాధురిలు వ్యవహరిస్తున్నారు. ఈ సీజన్ గ్రాండ్ గాలా ఆడియన్స్, జడ్జస్ ని మెప్పిస్తున్నాయి.

ఈ షోలో చెన్నై స్ట్రింగ్స్ ఆర్కెస్ట్రా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. తాజా ఎపిసోడ్ లో థమన్, యంగ్ సింగర్ స్కందతో కలిసి వేదికపైకి వచ్చి అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చారు. థమన్, కార్తీక్ గేమ్ ఛేంజర్, పుష్ప 2 సినిమాల గురించి మాట్లాడారు. థమన్ తన సూపర్ హిట్ సాంగ్ ‘మగువా మగువా..’ సాంగ్ వెనుక ఉన్న స్ఫూర్తిని పంచుకున్నారు. తన తల్లికి ట్రిబ్యుట్ గా ఈ పాట చేశాను అంటూ ఎమోషనల్ అయ్యారు.

Also Read : Bujji in Bhimavaram : ఇదెక్కడి మాస్ రా బాబు.. ప్రభాస్ రేంజ్‌లో భీమవరంలో ‘బుజ్జి’ హవా.. బుజ్జితో ఉండి ఎమ్మెల్యే..

అలాగే అద్భుతంగా పాడిన శ్రీ కీర్తి సాంగ్ వీడియోలు మాస్ట్రో ఇళయరాజాకి పంపిస్తానని కార్తీక్ చెప్పడం హైలెట్. ఇలా అదిరిపోయే సాంగ్స్, ఎమోషనల్ మూమెంట్స్, కామెడీతో ఆహాలో తెలుగు ఇండియన్ ఐడల్ 3 దూసుకుపోతుంది. ఆహాలో ప్రతి శుక్రవారం, శనివారం రాత్రి 7 గంటలకు కొత్త ఎపిసోడ్ తో ఈ షో ప్రసారం అవుతుంది.