Dasara Movie: నాచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం ‘దసరా’ నేడు భారీ అంచనాల మధ్య అయ్యింది. పూర్తి రా అండ్ రస్టిక్ మూవీగా ఈ సినిమాను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సినిమాలో నాని పర్ఫార్మెన్స్కు ఫిదా అవుతున్నారు. రిలీజ్ అయిన అన్ని చోట్లా ఈ సినిమాకు సాలిడ్ రెస్పాన్స్ వస్తుండటంతో దసరా మూవీ ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందా అని సినీ ఎక్స్పర్ట్స్ లెక్కలు వేస్తున్నారు.
Dasara Movie: దసరా సక్సెస్ సెలబ్రేషన్స్.. సందడి చేసిన నాని, కీర్తి సురేష్!
ఇదిలా ఉండగా, ఈ సినిమా ఓటీటీ పార్ట్నర్ను లాక్ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ దసరా చిత్ర డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌ను థియేట్రికల్ రన్ ముగిసిన తరువాత చేయనుంది. ఇక ఈ రైట్స్ కోసం నెట్‌ఫ్లిక్స్ చిత్ర నిర్మాతలకు భారీ మొత్తాన్ని ఇచ్చినట్లుగా తెలుస్తోంది. నాని పవర్‌ప్యాక్డ్ పర్ఫార్మెన్స్, కీర్తి సురేష్ యాక్టింగ్, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వ ప్రతిభ కలగలిసి ఈ సినిమాను పూర్తిస్థాయి ఎంటర్టైనర్గా నిలబెట్టినట్లుగా సినీ ఎక్స్పర్ట్స్ అంటున్నారు.
Nani Dasara : ‘దసరా’కు టికెట్ రేట్లు పెంచి నాని తప్పు చేశాడా?? ఇలా అయితే కష్టమే..
ఇక ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం మేజర్ అసెట్‌గా నిలిచింది. ఈ మూవీ సాంగ్స్ ఇప్పటికే చార్ట్‌బస్టర్స్‌లో టాప్ ప్లేస్‌లో దూసుకెళ్తున్నాయి. మరి దసరా చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్ ఎప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ చేస్తుందో చూడాలి.