Dharmendra : 87 ఏళ్ళ వయసులో లిప్ కిస్ ఇచ్చిన బాలీవుడ్ స్టార్.. పట్టించుకోనంటున్న భార్య..

‘రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహాని’ సినిమాలో ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరో ధర్మేంద్ర, ఒకప్పటి స్టార్ హీరోయిన్ షబానా అజ్మీ(Shabana Azmi) కూడా జంటగా నటించారు. అయితే ఈ సినిమా లవ్ స్టోరీ కావడంతో వీళ్లిద్దరి మధ్య కూడా ఒక మంచి లవ్ స్టోరీ పెట్టి లిప్ కిస్ సీన్ కూడా పెట్టారు.

Dharmendra Lip kiss Scene in Rocky Aur Rani Ki Prem Kahani Movie with Shabana Azmi Hema Malini Reacts

Dharmendra : బాలీవుడ్ అగ్ర దర్శక నిర్మాత కరణ్ జోహార్(Karan Johar) చాలా గ్యాప్ తర్వాత డైరెక్టర్ గా ‘రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహాని’ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. రణవీర్ సింగ్(Ramveer Singh), అలియా భట్(Alia Bhatt) జంటగా తెరకెక్కిన ‘రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహాని’(Rocky Aur Rani Ki Prem Kahani) బాలీవుడ్(Bollywood) లో మంచి విజయం సాధించింది. ఇప్పటికే ఈ సినిమా దాదాపు 250 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ సినిమాలో చాలా మంది స్టార్ యాక్టర్లు కూడా నటించారు.

‘రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహాని’ సినిమాలో ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరో ధర్మేంద్ర, ఒకప్పటి స్టార్ హీరోయిన్ షబానా అజ్మీ(Shabana Azmi) కూడా జంటగా నటించారు. అయితే ఈ సినిమా లవ్ స్టోరీ కావడంతో వీళ్లిద్దరి మధ్య కూడా ఒక మంచి లవ్ స్టోరీ పెట్టి లిప్ కిస్ సీన్ కూడా పెట్టారు. 87 ఏళ్ళ ధర్మేంద్ర 72 ఏళ్ళ షబానా ఆజ్మీకి లిప్ కిస్ ఇవ్వడంతో ఈ సన్నివేశం బాగా వైరల్ అయింది. దీనిపై విమర్శలు కూడా వచ్చాయి.

తాజాగా ధర్మేంద్ర భార్య హేమమాలిని(Hema Malini) ఈ కిస్సింగ్ సీన్ పై స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో హేమమాలినితో మీ భర్త ఈ వయసులో లిప్ కిస్ సీన్ చేస్తే మీకేమనిపించింది, బయట విమర్శలు వస్తున్నాయి అని ప్రశ్నంచగా హేమమాలిని సమాధానమిస్తూ.. నేను కొంతమంది చెప్తే విని ఆ సీన్ ని లైట్ తీసుకున్నాను. అసలు నేను సినిమా చూడలేదు. ఆయన తెరపై కనిపిస్తే అభిమానులు సంతోషిస్తారు. ఆయన విషయంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఆయన ఇప్పటికి కూడా కెమేరా ముందుకు వచ్చి నటించాలనుకుంటారు. సినిమా లేకుండా ఆయన జీవించలేరు కాబట్టి అయన సినిమా కోసం ఏం చేసినా నేను పట్టించుకోను అని తెలిపింది.

Rajamouli Nani Movie : రాజమౌళి దర్శకత్వంలో నాని సినిమా.. జక్కన్నని రిక్వెస్ట్ చేస్తున్న నాని..?

ఇక హేమమాలిని ధర్మేంద్రకు రెండో భార్య అనే సంగతి తెలిసిందే. ధర్మేంద్ర మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే రెండో భార్యగా హేమమాలినికి చేసుకున్నాడు. ప్రస్తుతం ధర్మేంద్రకు ఇద్దరి భార్యల ద్వారా ఉన్న పిల్లలంతా కుడా సినిమాల్లోనే ఉన్నారు.

ట్రెండింగ్ వార్తలు