Educational Institutions : తెలంగాణలో సోమవారం నుంచి విద్యాసంస్థలు తిరిగి ప్రారంభం..!

కరోనా కేసులు పెరగడంతో ప్రభుత్వం ఈనెల 8 నుంచి విద్యాసంస్థలను మూసివేసింది. అప్పటినుంచి జనవరి 16 వరకు సంక్రాంతి సెలవులు ఇచ్చారు. కేసుల పెరుగుదల ఆగకపోవడంతో సెలవులు 30 వరకు పొడిగించారు.

Educational institutions reopen : తెలంగాణలో విద్యాసంస్థలు తిరిగి ప్రారంభం కానున్నాయి. సోమవారం నుంచి విద్యాసంస్థలను తెరవాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. విద్యాసంస్థలు తెరిచాక.. కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. సెలవులు ముగుస్తుండటం.. పాఠశాలలు తిరిగి ప్రారంభంపై ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు ప్రశ్నించింది. దీంతో సర్కార్‌ ఈ నిర్ణయం తీసుకుంది. సర్కార్ ఇవాళ తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముంది. మరోవైపు విద్యాసంస్థలు తెరవాలని విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి రావడం కూడా ఓ కారణంగా కనిపిస్తోంది. పదో తరగతి పరీక్షలు కూడా సమీపిస్తున్నందున పాఠశాలలు తెరవాలని సర్కార్ నిర్ణయించినట్లు సమాచారం.

కరోనా థర్డ్‌ వేవ్‌, ఒమిక్రాన్​ వ్యాప్తితో రాష్ట్రంలో కేసులు పెరగడం వల్ల ప్రభుత్వం ఈ నెల 8 నుంచి విద్యాసంస్థలను మూసివేసింది. అప్పటి నుంచి జనవరి 16 వరకు సంక్రాంతి సెలవులు ఇచ్చారు. ఆ తర్వాత కేసుల పెరుగుదల ఆగకపోవడంతో ఆ సెలవులను 30 వరకు పొడిగించారు. 15 ఏళ్లు దాటిన వారికి టీకా పంపిణీ, విద్యాసంస్థల్లోని ఉపాధ్యాయులకు, బోధనేతర సిబ్బందికి టీకా ఇవ్వడం.. మరోవైపు జ్వర సర్వే పూర్తవ్వడం వల్ల కరోనా వ్యాప్తి తీరును అంచనా వేసిన సర్కార్.. విద్యాసంస్థలు తెరిచేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

AP Employees Strike : ఏపీలో పీఆర్సీ వార్‌.. ఉద్యోగుల సమ్మెకు పెరుగుతున్న మద్దతు

ప్రస్తుతం 8, 9, 10వ తరగతుల విద్యార్థులతో పాటు, ఇంటర్‌, డిగ్రీ విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్నారు. ఇవి ప్రత్యక్ష బోధనకు ప్రత్యామ్నాయం కాదనే వాదనలు వినిపిస్తుండటం.. తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి వస్తోంది. మరోవైపు.. పాఠశాలల ప్రారంభంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారని శుక్రవారం రోజున హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో.. త్వరలోనే తన నిర్ణయాన్ని ప్రకటిస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి.

తెరవగానే షెడ్యూల్..ఇప్పటికే ఇంటర్‌, పదో తరగతి పరీక్షల ఫీజు గడువును ప్రభుత్వం పొడిగించింది. వార్షిక పరీక్షల నిర్వహణపై కూడా షెడ్యూల్‌ ప్రకటించాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సెలవులు కొనసాగుతుండటం వల్ల పరీక్షలపై ఇంకా తుది నిర్ణయాన్ని వెల్లడించలేదు. విద్యా సంస్థలను తెరిచిన వెంటనే వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేయనున్నట్లు సమాచారం.

Civilians Moon : జాబిల్లిపైకి సామాన్యులను తీసుకెళ్లే క్రూయిజర్‌ వాహనం

పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో స్కూల్స్ రీఓపెన్ చేయాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం స్కూల్స్ రీఓపెనింగ్‌పై మార్గదర్శకాలు రూపొందిస్తోంది. పాఠశాలలు తెరవడం కోసం ఉన్న అన్ని అవకాశాలను పరిశీలించాలని కేంద్ర ఆరోగ్య శాఖ.. నిపుణుల బృందాన్ని ఆదేశించినట్టు సంబంధితవర్గాలు తెలిపాయి. ఈ మార్గదర్శకాలను రాష్ట్రాలకు త్వరలోనే పంపించనున్నట్టు వివరించాయి.

ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు స్కూల్స్‌ను మళ్లీ తెరవడంపై నిర్ణయం తీసుకున్నాయి. పదో తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులను కొన్ని షరతులతో తరగతులకు హాజరు కావచ్చని తెలిపాయి. 15 నుంచి 18 ఏళ్ల వయసు ఉన్న విద్యార్థులు కనీసం ఒక్క డోసు అయినా తీసుకోవాలనే కండీషన్స్ పెట్టాయి.18 ఏళ్లు పైబడిన విద్యార్థులు, పాఠశాల సిబ్బంది తప్పకుండా రెండు డోసుల టీకా తీసుకోవాలని స్పష్టం చేశాయి.

Boy Addict PUBG : పబ్‌ జీకి బానిసై నలుగురు కుటుంబసభ్యులను కాల్చిచంపిన బాలుడు

మహారాష్ట్ర అన్ని తరగతులకు పాఠశాలలను రీఓపెనింగ్ చేయాలనే నిర్ణయం తీసుకుంది. స్కూల్స్ తెరవాలని ప్రకటించింది. హర్యానా, ఛండీగడ్‌లు కూడా 10వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులకు స్కూల్స్ ఓపెన్ చేయాలని ప్రకటనలు విడుదల చేశాయి. ఢిల్లీ ప్రభుత్వం కూడా స్కూల్స్ ఓపెన్ చేయాలనే సిఫారసులను లెఫ్టినెంట్ గవర్నర్‌కు చేసింది. తమిళనాడు ప్రభుత్వం కూడా స్కూళ్ల రీ ఓపెనింగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ట్రెండింగ్ వార్తలు