అధిక వడ్డీ ఆశచూపి రూ.200 కోట్లతో పరార్.. టెస్కాబ్ ఉన్నతాధికారి వాణి బాల సస్పెండ్..

అధిక వడ్డీ ఇస్తామని ఆశచూపి ఓ ప్రైవేట్ ఫైనాన్స్ చిటఫండ్ సంస్థ నిర్వాహకులు ప్రజలను నిలువునా మోసం చేశారు. 537 మంది నుంచి సుమారు రూ. 200 కోట్ల డిపాజిట్లు సేకరించి బిచాణా ఎత్తేశారు.

TSCAB GM Vani Bala Cheating : అధిక వడ్డీ ఇస్తామని ఆశచూపి ఓ ప్రైవేట్ ఫైనాన్స్ చిటఫండ్ సంస్థ నిర్వాహకులు ప్రజలను నిలువునా మోసం చేశారు. శ్రీ ప్రియాంక ఎంటర్ ఫ్రైజెస్ చిట్ ఫండ్ పేరుతో 537 మంది నుంచి సుమారు రూ. 200 కోట్ల డిపాజిట్లు సేకరించి తాజాగా బిచాణా ఎత్తేశారు. దీంతో బాధితులు సీసీఎస్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంతకీ రూ. 200 కోట్ల డిపాజిట్లతో పరారైన శ్రీ ప్రియాంక ఎంటర్ ప్రైజెస్ సంస్థ నిర్వాహకుడు ఎవరో కాదు.. రాష్ట్ర సహకార కేంద్ర బ్యాంక్ (టెస్కాబ్)లో జీఎంగా పనిచేస్తున్న నిమ్మగడ్డ వాణి బాల భర్త. ఆమె మాటలు నమ్మి సహోద్యోగులు, అధికారులు భారీగా ఆ సంస్థలో డిపాజిట్లుచేసి మోసపోయారు. అంతేకాదు.. టెస్కాబ్ లో మేనేజర్ గా పనిచేస్తూ తన ప్రైవేట్ చిట్ ఫండ్ లో వాణి బాల పెట్టుబడులు పెట్టారు. ప్రస్తుతం ఆమెకూడా పరారీలో ఉన్నారు. దీంతో వాణి బాలను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సదరు చిట్ ఫండ్ కంపెనిపైన సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Also Read : కౌంట్ డౌన్ మొదలైంది..! కాంగ్రెస్ ప్రభుత్వంపై ట్విటర్ వేదికగా కేటీఆర్ ఫైర్..

అబిడ్స్ లోని తెలంగాణ స్టేట్ కోఆపారేటివ్ బ్యాంక్ (టెస్కాబ్) లో జనరల్ మేనేజర్ గా నిమ్మగడ్డ వాణి బాల పనిచేస్తున్నారు. తన భర్త మేక నేతాజీ, మేక శ్రీహర్షలు శ్రీప్రియాంక ఎంటర్ ఫ్రైజెస్ చిట్ ఫండ్ పేరుతో డిపాజిట్లు సేకరించారు. బ్యాంకుకు వచ్చి డిపాజిట్లు చేయాలనుకున్న వినియోగదారులను ఆకర్షించి వారితో డిపాజిట్లు చేయించారు. బ్యాంక్ సమీపంలోనే తన భర్తతో మరో ఆఫీస్ ను వాణి బాల ఓపెన్ చేయించారు. శ్రీ ప్రియాంక ఎంటర్ ఫ్రైజెస్ పేరుతో సుమారు రూ. 200 కోట్లు డిపాజిట్లు సేకరించిన వాణి బాల కుటుంబం ప్రస్తుతం వాటితో పరారైంది. ఈ వ్యవహారంలో సూత్రధారి టెస్కాబ్ బ్యాంక్ జనరల్ మేనేజర్ నిమ్మగడ్డ వాణి బాలనే అని పోలీసులు భావిస్తున్నారు.

Also Read : ప్రమాదమా? కుట్రపూరిత హత్యా? ఇరాన్ అధ్యక్షుడు రైసీ దుర్మరణంపై అనేక అనుమానాలు

మోసపోయామని భావించిన బాధితులు.. తమకు న్యాయం చేయాలని బషీర్ బాగ్ లోని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు. డిపాజిట్ల రూపంలో తీసుకొని అధిక వడ్డీలు ఇస్తామని నమ్మబలికి 517 మంది వద్ద డబ్బులు వసూళ్లు చేశారని, వారిని గుర్తించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు