Cotton Cultivation : పత్తిసాగుకు సన్నద్దమవుతున్న రైతులు.. సాగులో మేలైన యాజమాన్యం

పత్తిని పండించే దేశాలలో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. ఉత్పత్తి , ఎగుమతులలో రెండవ స్థానాన్ని ఆక్రమించింది. దేశంలో మహారాష్ట్ర, గుజరాత్‌తర్వాత తెలంగాణ రాష్ట్రం ప్రత్తి సాగు విస్తీర్ణం , ఉత్పత్తిలో మూడవ స్థానంలో ఉంది. దాదాపు 70 శాతం విస్తీర్ణంలో పత్తి సాగవుతుంది.

Cotton Cultivation

Cotton Cultivation : తెలుగు రాష్ట్రాల్లో , రైతులు.. పత్తిని వర్షాధారంగా మెట్టప్రాంతాల్లో సాగుచేస్తున్నారు. అయితే ఖరీఫ్ పత్తి విత్తేందుకు సిద్దమైనారు. ఇప్పటికే దుక్కులు దున్ని, విత్తనాలు , ఎరువులు సేకరించుకొని పెట్టుకున్నారు.  సాధారణంగా పత్తిని జులై 15 వరకు సాగుచేసుకోవచ్చు. తరువాత సాగుచేస్తే దిగుబడులు గణనీయంగా తగ్గి తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ నేపధ్యంలో పత్తిసాగు లో చేపట్టాల్సిన మేలైన యాజమాన్యం గురించి రైతులకు తెలియజేస్తున్నారు, ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త  డా. తిరుమలరావు .

READ ALSO : Tomato : టమాట ధర కిలో రూ.155.. ఎక్కడో తెలుసా?

ప్రపంచంలో పత్తిని పండించే దేశాలలో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. ఉత్పత్తి , ఎగుమతులలో రెండవ స్థానాన్ని ఆక్రమించింది. దేశంలో మహారాష్ట్ర, గుజరాత్‌తర్వాత తెలంగాణ రాష్ట్రం ప్రత్తి సాగు విస్తీర్ణం , ఉత్పత్తిలో మూడవ స్థానంలో ఉంది. దాదాపు 70 శాతం విస్తీర్ణంలో పత్తి సాగవుతుంది. అయితే ఈ ఏడాది నైరుతి రుతుపవనాల ఆగమనం ఆలస్యం కావడంతో.. జూలై 15 వరకు పత్తి సాగుచేసే అవకాశం వున్నందున ,రైతులు  వర్షపాతం ఆశాజనకంగా నమోదయ్యే వరకు వేచిచూసే ధోరణి కనబరుస్తున్నారు .

READ ALSO : Cotton Seeds : ఒకే రకం పత్తి విత్తనాల సాగుకు రైతుల మొగ్గు..

ముఖ్యంగా పత్తి సాగుకు తేమను నిలుపుకోగల నల్ల రేగడి నేలలు, ఒండ్రు నేలలు అనువైనవి.  అయితే వర్షాధారంగా వేసే పత్తిలో అధిక దిగుబడులను సాధించాలంటే  రైతులు  సమగ్ర యాజమాన్యం చేపట్టాలని సూచిస్తున్నారు ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా. తిరుమల రావు.

ట్రెండింగ్ వార్తలు