Grapes : వేసవిలో చర్మానికి రక్షణగా ద్రాక్ష!

కొన్ని ద్రాక్ష పండ్ల‌ను తీసుకుని బాగా న‌లిపి ర‌సం తీసుకోవాలి.ఇప్పుడు ఆ ర‌సంలో కొద్దిగా తేనె వేసి మిక్స్ చేసుకోవాలి. అనంత‌రం ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసి.ఇరవై లేదా ముప్పై నిమిషాల పాటు ఆర‌నివ్వాలి.

Grapes : వేసవి కాలంలో ఎండతీవ్రత నుంచి చర్మానికి రక్షణ ఇవ్వడంలో ద్రాక్ష తోడ్పడుతుంది. ఇదే విషయం పలు అధ్యయనాల్లో సైతం బయటపడింది. సూర్యరశ్మిలోని అతినీలలోహిత కిరణాల నుంచి చర్మానికి రక్షణ కల్పించి స్కిన్‌ డ్యామేజీని అడ్డుకునే పాలీఫినాల్స్‌ అనే సహజసిద్ధ గుణాలు ద్రాక్షలో ఉన్నాయి. వేసవిలో ద్రాక్షను తిన్నా, లేదంటే చర్మపు పైపూతగా పూసుకునే సన్‌స్ర్కీన్‌ లోషన్లతో పాటు ద్రాక్ష రసాన్ని కూడా చర్మానికి పట్టించినా మంచి ఫలితం ఉంటుంది.

ద్రాక్షపండ్లలో ఎ, సి, బి-6 వంటి విటమిన్లతోపాటు, క్యాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్, ఐరన్, మెగ్నీషియం వంటి ఖనిజ లవణాలు ఉంటాయి. శరీరంలో వ్యాది నిరోధక శక్తిని పెంచడానికి తోడ్పడతాయి. జలుబు, దగ్గు, ఫ్లూ.. వంటి ఆరోగ్య సమస్యలు రాకుండా చేస్తాయి. ద్రాక్షతో ఎండ నుంచి అదనపు రక్షణ దక్కుతుందని నిపుణులు సూచిస్తున్నారు. నలుపు రంగు రెస్వెరాట్రాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ చర్మ కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది. యాంటీ ఏజింగ్ లక్షణాలు చర్మాన్ని యవ్వనంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. ద్రాక్షలోని విటమిన్ సి చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. ముఖంపై మొటిమలని నివారిస్తుంది.

కొన్ని ద్రాక్ష పండ్ల‌ను తీసుకుని బాగా న‌లిపి ర‌సం తీసుకోవాలి.ఇప్పుడు ఆ ర‌సంలో కొద్దిగా తేనె వేసి మిక్స్ చేసుకోవాలి. అనంత‌రం ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసి.ఇరవై లేదా ముప్పై నిమిషాల పాటు ఆర‌నివ్వాలి. చ‌ల్ల‌టి నీటితో ముఖాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా వారానికి మూడు, నాలుగు సార్లు చేయ‌డం వ‌ల్ల ముడ‌త‌లు త‌గ్గి చ‌ర్మం య‌వ్వ‌నంగా కనిపిస్తుంది. అదేవిధంగా కొన్ని ద్రాక్ష పండ్ల‌ను తీసుకుని పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్‌లో కొద్దిగా పెరుగు మ‌రియు నిమ్మ‌రసం వేసి క‌లుపుకోవాలి.ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసి అర‌గంట పాటు వ‌దిలేయాలి. అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి.ఇలా వారినికి రెండు లేదా మూడు సార్లు చేయ‌డం వ‌ల్ల ముఖంపై ఉన్న మొటిమ‌లు, మ‌చ్చ‌లు పోయి చర్మం కాంతివంతంగా మారుతుంది.

ట్రెండింగ్ వార్తలు