Yami Gautam : పండంటి బాబుకి జన్మనిచ్చిన బాలీవుడ్ హీరోయిన్.. పేరేంటో తెలుసా?

తాజాగా హీరోయిన్ యామీ గౌత‌మ్ పండంటి బాబుకు జన్మనిచ్చింది.

Bollywood Actress Yami Gautam Dhar Gave Birth to Baby Boy

Yami Gautam : తెలుగులో నువ్విలా, గౌరవం, కొరియర్ బాయ్ కళ్యాణ్.. లాంటి పలు సినిమాలతో మెప్పించిన యామీ గౌత‌మ్ ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఓ పక్క యాడ్స్, మరో పక్క సినిమాలతో బిజీగా ఉంది. 2021లో యామీ గౌత‌మ్ బాలీవుడ్ పరిశ్రమలోని సినీ రచయిత ఆదిత్య ధర్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.

పెళ్లి తర్వాత కూడా యామీ గౌత‌మ్ సినిమాలు చేస్తుంది. తాజాగా యామీ గౌత‌మ్ పండంటి బాబుకు జన్మనిచ్చింది. కొన్ని నెలల క్రితం తాను ప్రగ్నెంట్ అని ప్రకటించింది యామీ. తాజాగా నిన్న సోషల్ మీడియాలో.. అక్షయతృతీయ రోజు మాకు బాబు జన్మించాడు. అతనికి ‘వేదవిద్’ అనే పేరు పెట్టాము. మా బాబుకి మీ అందరి ఆశీర్వాదాలు కావాలి అని పోస్ట్ చేసింది.

Also Read : Anand Deverakonda : సినిమా కోసం ఆనంద్ దేవరకొండ మెడపై టాటూ.. మీనింగ్ ఏంటో తెలుసా?

దీంతో యామీ గౌత‌మ్ పోస్ట్ వైరల్ గా మారగా బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులంతా కంగ్రాట్స్ చెప్తూ కామెంట్స్ చేస్తున్నారు. మృణాల్, కాజల్, రాశిఖన్నా, రణవీర్ సింగ్.. ఇలా చాలా మంది సెలబ్రిటీలు యామీ గౌతమ్ జంటకు శుభాకాంక్షలు చెప్తున్నారు. ఇక ఇటీవలే యామీ గౌతమ్ OMG, ఆర్టికల్ 370 సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ భారీ హిట్స్ కొట్టింది.