Gautam Gambhir : గౌత‌మ్ గంభీర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. సెల‌క్టర్ కాళ్లు ప‌ట్టుకోలేద‌ని జ‌ట్టులోకి ఎంపిక చేయ‌లేదు

టీమ్ఇండియా టీ20, వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ నెగ్గ‌డంలో గౌత‌మ్ గంభీర్‌ కీల‌క పాత్ర పోషించాడు.

Gambhir : టీమ్ఇండియా టీ20, వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ నెగ్గ‌డంలో గౌత‌మ్ గంభీర్‌ కీల‌క పాత్ర పోషించాడు. ఓపెన‌ర్‌గా అద్భుత‌మైన ఇన్నింగ్స్‌ల‌లో అల‌రించాడు. ప్ర‌స్తుతం ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ కు మెంటార్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ఆ జ‌ట్టు ప్లే ఆఫ్స్‌కు చేరుకోవ‌డంలోనూ త‌న వంతు పాత్ర పోషించాడు. కాగా.. ఓ కార్య‌క్ర‌మంలో గంభీర్ మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను పంచుకున్నాడు. తన చిన్నతనంలో ఓ సెలక్టర్ కాళ్లు మొక్కలేదని జట్టులోకి ఎంపిక చేయలేదన్నాడు.

ఆ స‌మ‌యంలో త‌న‌కు 12 లేదా 13 సంవ‌త్స‌రాలు ఉంటాయ‌ని, అండ‌ర్‌-14 టోర్న‌మెంట్ కోసం ఎంతో క‌ష్ట‌ప‌డినా జ‌ట్టుకు ఎంపిక కాలేద‌ని గంభీర్ చెప్పాడు. ఇందుకు గ‌ల కార‌ణం త‌రువాత తెలిసింద‌న్నాడు. సెల‌క్ట‌ర్ కాళ్లు మొక్క‌లేద‌ని, అందుక‌నే త‌న‌ను ఎంపిక చేయ‌న‌ట్లుగా తెలిసింది. ఆ స‌మ‌యంలో నేను ఓ నిర్ణ‌యానికి వ‌చ్చాను. తాను ఎవ‌రీ కాళ్లు ప‌ట్టుకోవ‌ద్ద‌ని, త‌న కాళ్లు ఎవ‌రితోనూ ప‌ట్టించుకోవ‌ద్ద‌ని అనుకున్న‌ట్లు గంభీర్ చెప్పాడు.

ఫైనల్లో అడుగు పెట్టేదెవరు? కోల్‌కతా వర్సెస్ హైదరాబాద్ జట్ల మధ్య క్వాలిఫయర్ మ్యాచ్.. ఎవరి బలం ఎంతంటే?

ఇక అండ‌ర్ 16, అండ‌ర్ 19, రంజీ ట్రోఫీ, టీమ్ఇండియా త‌రుపున ఆడుతూ విఫ‌లం అయిన సంద‌ర్భాల్లో బ‌య‌ట నుంచి ఎన్నో కామెంట్లు వ‌చ్చేవ‌న్నాడు. నువ్వు మంచి కుటుంబం నుంచి వ‌చ్చావు. అస‌లు నీకు క్రికెట్ ఆడాల్సిన అవ‌స‌రం లేదు. నీకు ఎన్నో అవ‌కాశాలు ఉన్నాయి. మీ నాన్న బిజినెస్‌ల‌ను చూసుకోవ‌చ్చు అంటూ త‌న‌కు స‌ల‌హాలు ఇచ్చేవార‌న్నాడు. దీంతో త‌న మ‌న‌సు ఎన్నో ఆలోచ‌న‌ల‌తో నిండిపోయింద‌న్నాడు.

వాటి నుంచి బ‌య‌ట ప‌డేందుకు ఎంతో శ్ర‌మించిన‌ట్లు గంభీర్ చెప్పుకొచ్చాడు. త‌న‌కు కుటుంబం కంటే క్రికెట్ ఎక్కువ‌నే విష‌యాన్ని ప్ర‌జ‌లు ఎందుకు అర్థం చేసుకోవ‌డం లేద‌ని అనిపించేద‌న్నాడు. కాగా.. టీమ్ఇండియా త‌రుపున గంభీర్ 58 టెస్టులు, 147 వన్డేలు, 37 టీ20లు ఆడాడు. వ‌న్డేల్లో 5238 ప‌రుగులు, టెస్టుల్లో 4154 ప‌రుగులు, టీ20ల్లో 932 ప‌రుగులు చేశాడు.

IPL 2024 Playoffs: ఆర్సీబీ జట్టు గతంలో ఎన్నిసార్లు ఎలిమినేటర్ మ్యాచ్‌లు ఆడిందో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు