ఫైనల్లో అడుగు పెట్టేదెవరు? కోల్‌కతా వర్సెస్ హైదరాబాద్ జట్ల మధ్య క్వాలిఫయర్ మ్యాచ్.. ఎవరి బలం ఎంతంటే?

ఐపీఎల్ 2024 సీజన్ లో లీగ్ దశ మ్యాచ్ లు పూర్తయ్యాయి. ఇప్పుడు అసలైన సమరం ఆరంభం కానుంది. తొలి క్వాలిఫయర్ మ్యాచ్ ఇవాళ రాత్రి 7.30 గంటల నుంచి

ఫైనల్లో అడుగు పెట్టేదెవరు? కోల్‌కతా వర్సెస్ హైదరాబాద్ జట్ల మధ్య క్వాలిఫయర్ మ్యాచ్.. ఎవరి బలం ఎంతంటే?

IPL 2024 SRH vs KKR

KKR vs SRH Match Preview: ఐపీఎల్ 2024 సీజన్ లో లీగ్ దశ మ్యాచ్ లు పూర్తయ్యాయి. ఇప్పుడు అసలైన సమరం ఆరంభం కానుంది. తొలి క్వాలిఫయర్ మ్యాచ్ ఇవాళ రాత్రి 7.30 గంటల నుంచి అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ మధ్య పోరు జరగనుంది. ఇరు జట్లు అన్ని విభాగాల్లో సమఉజ్జీలుగా ఉండటంతో రెండు జట్ల మధ్య పోరు భీకరంగా ఉండబోతుందని క్రికెట్ ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. పిచ్ బ్యాటర్లకు అనుకూలించేలా ఉండటం.. ఇరు జట్ల బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉండటంతో ఈ మ్యాచ్ లో భారీ స్కోర్లు నమోదు కావడం ఖాయమని క్రికెట్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Also Read : IPL 2024 Playoffs: ఆర్సీబీ జట్టు గతంలో ఎన్నిసార్లు ఎలిమినేటర్ మ్యాచ్‌లు ఆడిందో తెలుసా?

లీగ్ దశలో కేకేఆర్ దే పైచేయి..
లీగ్ దశలో కేకేఆర్ జట్టు 20 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం 14 మ్యాచ్ లు ఆడిన కేకేఆర్ జట్టు.. తొమ్మిది మ్యాచ్ లలో విజయం సాధించగా.. మూడు మ్యాచ్ లలో ఓడిపోయింది. మరో రెండు మ్యాచ్ లు వర్షం కారణంగా రద్దయ్యాయి. హైదరాబాద్ జట్టు 14 మ్యాచ్ లలో ఎనిమిది మ్యాచ్ లలో విజయం సాధించి.. ఐదు మ్యాచ్ లలో ఓటమి పాలైంది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో 17 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. లీగ్ మ్యాచ్ లో హైదరాబాద్, కోల్ కతా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో కోల్ కతా జట్టు నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ ఫలితాలను బట్టిచూస్తే లీగ్ దశలో కోల్ కతా జట్టు హైదరాబాద్ జట్టుకంటే మెరుగైన ప్రదర్శన కనబర్చింది. ఇదిలాఉంటే.. ప్లేఆఫ్స్ దశలో కేకేఆర్ జట్టు ఎనిమిది సార్లు విజయం సాధించగా.. ఐదు సార్లు ఓడిపోయింది. అదే హైదరాబాద్ జట్టు ప్లే ఆఫ్స్ దశలో ఐదు సార్లు గెలిచి.. ఆరు సార్లు ఓడిపోయింది.

Also Read : RCB : గెలుపు సంబ‌రాల్లో బెంగ‌ళూరు ఆట‌గాళ్లు.. ధోనికి షేక్‌హ్యాండ్ కూడా ఇవ్వ‌లేదా?

ఇరు జట్ల బలాబలాలు ఇలా..
ఇరు జట్లకు బ్యాటింగ్ ప్రధాన బలం. కోల్ కతా ఓపెనర్ సునీల్ నరైన్ అద్భుతంగా రాణిస్తున్నాడు. నితీశ్ రాణా, శ్రేయాస్ అయ్యర్, రింకూ సింగ్, గుర్బాజ్ తో స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉంది. ఏ క్షణమైనా మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసే ఆల్ రౌండర్ రస్సెల్ ఈ జట్టుకు అదనపు బలం. సాల్ట్ సూపర్ ఫాంలో లేకపోవటంతో ఆ జట్టుకు కొంచెం మైనస్ అనే చెప్పొచ్చు. అతడుకూడా ఫామ్ లోకి వస్తే కోల్ కతా పరుగుల వరద పారించడం ఖాయం. బౌలింగ్ విభాగంలోనూ కోల్ కతా జట్టు మెరుగైన ప్రదర్శన ఇస్తుంది. ప్రత్యర్థి బ్యాటర్స్ ను ఇబ్బంది పెట్టేలా కేకేఆర్ ఫేస్ దళం సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే మిచెల్ స్టార్క్ , హర్షిత్ రాణా రాణిస్తున్నారు. వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ స్పిన్ తో దుమ్ములేపుతున్నారు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ భారమంతా ఓపెనర్లపైనే ఉంది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ లు దంచికొడుతున్నారు. వీరుకొట్టే కొట్టుడుకు.. ఎస్ఆర్ హెచ్ కు మొదటి బ్యాటింగ్ ఇవ్వాలంటేనే ప్రత్యర్థి జట్లు భయపడుతున్న పరిస్థితి. రాహుల్ త్రిపాఠి, నితీశ్ రెడ్డి, క్లాసెస్ సూపర్ ఫాంలో ఉన్నారు. ఫినిషింగ్ టచ్ ఇచ్చేందుకు సమద్, షాబాద్ లు ఉండనే ఉన్నారు. ఇక హైదరాబాద్ జట్టులో బౌలింగ్ విభాగం పటిష్ఠంగా ఉంది. స్పిన్ విభాగంలో మాత్రం కొంత బలహీనంగా కనిపిస్తోంది. పిచ్ పేసర్లకు అనుకూలంగా ఉండటం హైదరాబాద్ జట్టుకు కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు. మొత్తానికి కోల్ కతా వర్సెస్ హైదరాబాద్ జట్ల మధ్య భీకర పోరు ఖాయంగా కనిపిస్తోంది.