IPL 2024 Playoffs: ఆర్సీబీ జట్టు గతంలో ఎన్నిసార్లు ఎలిమినేటర్ మ్యాచ్‌లు ఆడిందో తెలుసా?

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇప్పటి వరకు ఐపీఎల్ ట్రోపీని గెలుచుకోలేదు. ఈసారి ఐపీఎల్-2024 విజేతగా నిలిచేందుకు

IPL 2024 Playoffs: ఆర్సీబీ జట్టు గతంలో ఎన్నిసార్లు ఎలిమినేటర్ మ్యాచ్‌లు ఆడిందో తెలుసా?

IPL 2024 RCB

Royal Challengers Bengaluru : IPL 2024 సీజన్ లో భాగంగా నాలుగు జట్లు ప్లేఆఫ్స్ కు చేరాయి. క్వాలిఫయర్ -1లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తలపడుతుండగా.. ఎలిమినేటర్ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), రాజస్థాన్ రాయల్స్ (RR) జట్లు తలపడనున్నాయి. బెంగళూరు జట్టు ఎలిమినేటర్ మ్యాచ్ లో ఆడటం ఇదే మొదటి సారి కాదు.. గతంలో మూడు సార్లు ఎలిమినేటర్ మ్యాచ్ లో ఆర్సీబీ ఆడింది.. అందులో ఒక్కసారి మాత్రమే విజయం సాధించింది.

Also Read : IPL 2024 : హైదరాబాద్‌కు కలిసొచ్చిన వర్షం.. క్వాలిఫయర్‌లో తలపడే జట్లు ఇవే.. పూర్తి షెడ్యూల్ ఇలా ..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇప్పటి వరకు ఐపీఎల్ ట్రోపీని గెలుచుకోలేదు. ఈసారి ఐపీఎల్-2024 విజేతగా నిలిచేందుకు ఆర్సీబీ మరో మూడు అడుగుల దూరంలో ఉంది. ప్రస్తుతం.. ఈనెల 22న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ జట్టుతో ఎలిమినేటర్ మ్యాచ్ లో ఆర్సీబీ తలపడనుంది. ఆర్సీబీ జట్టు తొలిసారి ఐపీఎల్ -2020లో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడింది. ఆ సమయంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో ఆర్సీబీ తలపడింది. ఆ మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు విజయం సాధించింది. ఆ తరువాత సీజన్ ఐపీఎల్ 2021నూ బెంగళూరు జట్టు ఎలిమినేటర్ మ్యాచ్ ను ఆడింది. కేకేఆర్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయింది.

Also Read : RCB : గెలుపు సంబ‌రాల్లో బెంగ‌ళూరు ఆట‌గాళ్లు.. ధోనికి షేక్‌హ్యాండ్ కూడా ఇవ్వ‌లేదా?

ఐపీఎల్ 2022లోనూ ఆర్సీబీ ఎలిమినేటర్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుతో తలపడింది. అయితే, ఈ మ్యాచ్ లో ఆర్సీబీ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే, క్వాలిఫయర్ -2లో రాజస్థాన్ జట్టుపై ఆర్సీబీ ఓటమి పాలైంది. మొత్తం మీద మూడు సార్లు ఎలిమినేటర్ మ్యాచ్ ఆడిన ఆర్సీబీ జట్టు ఒక్కసారే విజయం సాధించింది. ప్రస్తుతం సీజన్ లో బుధవారం రాజస్థాన్ జట్టుతో జరిగే మ్యాచ్ లో ఆర్సీబీ జట్టు ఏ మేరకు రాణిస్తుందో వేచి చూడాల్సిందే.