Anand Deverakonda Neck Tattoo Meaning Revealed
Anand Deverakonda : విజయ్ దేవరకొండ తమ్ముడిగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చినా ఆనంద్ దేవరకొండ డిఫరెంట్ కథలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. త్వరలో ‘గం గం గణేశా’ సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా మే 31న రిలీజ్ కాబోతుంది. తాజాగా ‘గం గం గణేశా’ ట్రైలర్ రిలీజ్ చేసి ఓ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో ఆనంద్ దేవరకొండ పలు ఆసక్తికర అంశాలను మాట్లాడాడు.
ట్రైలర్ లో ఆనంద్ దేవరకొండ మెడపై ఓ చైనీస్ భాషలో టాటూ ఉన్నట్టు చూపించారు. అయితే అది ఏ అమ్మాయిని కలిసినా, వాళ్ళ ఫ్రెండ్స్ కలిసినా ఎవ్వరికి చైనీస్ భాష రాదు కాబట్టి తన పేరే వేయించుకున్నాను అని కామెడీగా చెప్పారు సినిమాలో. ట్రైలర్ లో ఈ టాటూ సీన్ బాగానే పండింది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఆనంద్ మాట్లాడుతూ ఈ టాటూ గురించి మాట్లాడాడు.
Also Read : Gam Gam Ganesha Trailer : ఆనంద్ దేవరకొండ ‘గం గం గణేశా’ ట్రైలర్ వచ్చేసింది..
ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ.. రెండేళ్ల క్రితం ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు ఒక టాటూ ఉండాలని వెతికి ఇది సెలెక్ట్ చేసాడు డైరెక్టర్. చైనా భాషలో దీన్ని గూగుల్ లో డీకోడ్ చేస్తే ఫ్యామిలీ అని వచ్చింది. మీరంతా, సినీ పరిశ్రమ అంతా నా ఫ్యామిలీనే. అందుకే ఇలా ఫ్యామిలీ అనే టాటూ తీసుకున్నాం అని చెప్పాడు. అయితే ఈ టాటూ కేవలం స్టిక్కర్ అని, టెంపరరీ టాటూ అని తెలుస్తుంది. సినిమా కోసమే టెంపరరీ స్టిక్కర్ టాటూ వేయించుకున్నట్టు తెలుస్తుంది. నిన్న ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో టాటూ వేసుకొని వచ్చి మాట్లాడినా, అంతకు ముందు ప్రమోషన్స్ లో టాటూ లేకపోవడం గమనార్హం. దీంతో కేవలం సినిమా కోసం టెంపరరీ టాటూ స్టిక్కర్స్ వాడినట్టు తెలుస్తుంది.