Covid : కోవిడ్ బిజినెస్‌ని దెబ్బతీసినా ఆత్మస్థైర్యంతో నిలబడ్డ జంట..ఇప్పుడు ఫుడ్ స్టాల్ నడుపుతూ..

కోవిడ్ సమయంలో పడ్డ కష్టాలు ఒక ఎత్తైతే.. ఆ తరువాత చాలామంది కోలుకోలేనంతగా నష్టపోయారు. కోవిడ్ కి ముందు ప్రింటింగ్ ప్రెస్ నడిపిన ఓ జంట ఇప్పుడు ఫుడ్ స్టాల్ రన్ చేస్తోంది. జీవితాన్ని తిరిగి నిర్మించుకుంటున్న ఈ జంట ఇప్పుడు చాలామందికి ఆదర్శంగా నిలుస్తోంది.

Couple Runs a Food Stall

Covid :  కోవిడ్ మహమ్మారి కలిగించిన నష్టం అంతా ఇంతా కాదు. ఏ ఇంటి తలుపు తట్టినా ఒక్కో కథ కన్నీరు తెప్పిస్తుంది. వ్యక్తుల్ని కోల్పోయిన వారు, వ్యాపారాలు మూసి వేసిన వారు, ఉద్యోగాలు కోల్పోయిన వారు ఇలా ఎన్నో దీనమైన గాథలు వినిపిస్తాయి. ఇక కరోనా బారిన పడి ఆస్తులు అమ్ముకుని ప్రాణాలు దక్కించుకున్నా ఇప్పటికీ దాని తాలూకు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు లేకపోలేదు. ఎంత నష్టం జరిగినా తిరిగి జీవితాన్ని పునర్నిర్మించుకునే పనిలో ఉన్నారు కొందరు. హర్యానాకు చెందిన ఓ జంట ప్రింటింగ్ ప్రెస్ బిజినెస్ లో తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడు రోడ్ సైడ్ ఫుడ్ పాయింట్ నడుపుతూ తిరిగి జీవనం మొదలుపెట్టారు.

Covid-19: దేశంలో మళ్లీ కోరలు చాస్తున్న కరోనా.. కొత్తగా 3,016 కేసులు నమోదు.. ఢిల్లీలో రికార్డు స్థాయిలో ..

ఫరీదాబాద్ కి చెందిన ఓ జంట (Haryana Couple ) కోవిడ్ కి (covid-19) ముందు ప్రింటింగ్ ప్రెస్ (printing press) నడిపేవారు. దాంతో కుటుంబ ఆర్ధిక పరిస్థితి బాగానే ఉండేది. లాక్ డౌన్ టైం నుంచి వారికి కష్టకాలం మొదలైంది. ప్రెస్ పూర్తిగా మూతపడింది. లాక్ డౌన్ (lockdown) తరువాత ఇంటి యజమాని చిన్న ఉద్యోగంలో చేరినా వారి కష్టాలు తీరలేదు. ఏదో ఒకటి చేసి ఈ పరిస్థితి నుంచి బయటపడాలని ఆ జంట బాగా ఆలోచించారు. తన భార్య వంట చేయడంలో ఎక్స్ పర్ట్ కావడంతో ఓ ఫుడ్ స్టాల్ (food stall) పెడితే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. వెంటనే దాన్ని అమలు చేశారు.

Gurugram: కోవిడ్ భయంతో మూడేళ్లుగా ఇంటి నుంచి బయటకు రాని తల్లీకొడుకు.. మూడేళ్లుగా ఎలా ఉన్నారంటే

ఈ స్టాల్ లో కడీ చావల్ (Kadhi Chawal) , రాజ్మా చావల్ (Rajma Chawal) , గ్రీన్ చట్నీ(green chutney) వంటి ఫుడ్ అందుబాటులో ఉంటాయి. కస్టమర్స్ కి అందుబాటు ధరల్లో కేవలం 40 రూపాయలకు రుచికరమైన ఫుడ్ అందిస్తున్నారు ఈ జంట. ఇక ఈ స్టాల్ లో ఫుడ్ తిన్నవారంతా చాలా రుచికరంగా ఉందని.. భగవంతుడు ఈ జంటని కరుణించాలని విష్ చేస్తున్నారు.

ఈ మొత్తం స్టోరిని ఫుడ్ బ్లాగర్ జతిన్ సింగ్ (Jatin Singh) సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఒక్కోసారి జీవితంలో పీక్స్ చూసి మళ్లీ ఎక్కడ మొదలయ్యామో అక్కడికే చేరుకున్నట్లు అయిపోతుంది. ఇలాంటి సమయంలో చాలామంది నిరుత్సాహపడిపోతారు. డిప్రెషన్ లోకి వెళ్లిపోతారు. కానీ ఏ మాత్రం బెదిరిపోకుండా మళ్లీ నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తే విజయం తప్పకుండా వరిస్తుందనడానికి ఈ జంటే ఉదాహరణ.

ట్రెండింగ్ వార్తలు