Temple in Railway station: రైల్వే స్టేషన్లో ఆలయం: తొలగిస్తే ప్రాణత్యాగానికి సిద్ధమన్న హిందూ సంఘాల ప్రతినిధులు

రైల్వే అధికారులు ఆలయాన్నితాకితే అక్కడే తామంతా మూకుమ్మడిగా ప్రాణత్యాగం చేసుకుంటామంటూ హెచ్చరించారు. దాదాపు 400 ఏళ్లుగా అందులోని దేవత విశేష పూజలు అందుకుంటుంది

Temple in Railway station: అదో పురాతన హిందూ దేవాలయం. దాదాపు 400 ఏళ్లుగా అందులోని దేవత విశేష పూజలు అందుకుంటుంది. అనుకోని విధంగా బ్రిటిష్ పాలనలో ఆ దేవాలయాన్ని కలుపుకుంటూ రైల్వేస్టేషన్ ను నిర్మించారు. అయినప్పటికీ నిత్యం వందలాది మంది హిందువులు దేవాలయానికి వెళ్లి అందులోని అమ్మవారిని పూజిస్తున్నారు. ఇది ఆగ్రా సమీపంలోని ‘రాజా కి మండి’ రైల్వే స్టేషన్ లో ఉన్న ‘చాముండ దేవి ఆలయం’ గురించి స్థానికులు చెప్పే విషయం. అయితే ఇప్పుడు ఈ ఆలయాన్ని తొలగించాలంటూ రైల్వే అధికారులు ఆలయ నిర్వాహకులకు నోటీసులు ఇచ్చారు. దీంతో రైల్వే అధికారుల తీరుపై హిందూ సంఘాల ప్రతినిధులు, ఆలయ నిర్వాహకులు, స్థానిక భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే అధికారులు ఆలయాన్నితాకితే అక్కడే తామంతా మూకుమ్మడిగా ప్రాణత్యాగం చేసుకుంటామంటూ హెచ్చరించారు.

Also read:P Chidambaram: మోదీకే ఇది సాధ్యం: దేశంలో విద్యుత్ కొరతపై కాంగ్రెస్ నేత పీ.చిదంబరం వ్యంగ్యాస్త్రాలు

ఈ అంశంపై రాష్ట్రీయ హిందూ పరిషత్ భారత్ జాతీయ అధ్యక్షుడు గోవింద్ పరాశర్ శనివారం మాట్లాడుతూ..ఆలయ తరలింపును అడ్డుకుంటామని అన్నారు. బ్రిటిష్ పాలన కంటే ముందు నుంచి అమ్మవారి ఆలయం ఇక్కడే ఉందని..బ్రిటిషు వారు సైతం హిందువుల మనోభావాలను గౌరవించి రైల్వే లైను నిర్మించే సమయంలో ఆలయం పక్క నుంచి కట్టలు వేశారని గోవింద్ పరాశర్ వివరించారు. ఆలయ తొలగింపుపై రైల్వేశాఖ అధికారులు వెనక్కు తగ్గి, దీనికి ప్రత్యామ్న్యాయ మార్గాన్ని చూపించాలని గోవింద్ పరాశర్ సూచించారు. చాముండ దేవి ఆలయ ప్రధాన అర్చకుడు మాట్లాడుతూ..తమ తాతలు, ముత్తాతల కాలం నుంచి ఈ ఆలయంలో అమ్మ వారికి పూజలు నిర్వహిస్తున్నామని..లక్షల మంది భక్తులు వస్తుంటారని, రైలు ప్రయాణానికి ముందు భక్తులు అమ్మవారికి మొక్కి ప్రయాణం సాగిస్తున్నారని తెలిపారు.

Also read:PM Modi : కోర్టుల్లో స్థానిక భాషల ఉపయోగంపై మోదీ కీలక వ్యాఖ్యలు

రైల్వే స్టేషన్ కంటే ముందు నుంచి ఈ ఆలయం ఇక్కడే ఉండగా..అది ఆక్రమిత ప్రాంతం ఎలా అవుతుందంటూ హిందూ జగరణ్ మంచ్ మాజీ కార్యదర్శి సురేంద్ర భాగోరే అన్నారు. కాగా, రాజా కి మండీ రైల్వే స్టేషన్ లోని చాముండ దేవి ఆలయం సహా..అగ్ర కంటోన్మెంట్ పరిధిలోని మరో రెండు రైల్వే స్టేషన్లలో ఉన్న..మసీదు, దర్గాలను కూడా తొలగించాలంటూ రైల్వేశాఖ అధికారులు ఆయా వర్గాల వారికి నోటీసులు పంపారు.

Also read:Mobile Internet Services : పటియాలాలో ఉద్రిక్తత.. మొబైల్‌ ఇంటర్నెట్‌, SMS సర్వీసులు బంద్‌!

ట్రెండింగ్ వార్తలు