ICC Women’s World Cup : భారత్ పరాజయం.. ఇంగ్లాండ్ గెలుపు

36.2 ఓవర్లలో 134 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని చేధించడానికి బరిలోకి దిగిన ఇంగ్లాండ్ సేన.. ఆడుతూ పాడుతూ గెలుపొందింది. వారిని కట్టడి చేసేందుకు భారత బౌలర్లు..

ENG Women Won By 4 Wickets : ఐసీసీ మహిళల ప్రపంచకప్ లో భారత్ కు మరో పరాజయం ఎదురైంది. ఇంగ్లాండ్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది. టీమిండియా మహిళా క్రీడాకారులు విఫలం చెందారు. టాస్ గెలిచి భారత్ కు బ్యాట్ అప్పగించింది. ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి చేతులేత్తేశారు. ఫలితంగా 36.2 ఓవర్లలో 134 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని చేధించడానికి బరిలోకి దిగిన ఇంగ్లాండ్ సేన.. ఆడుతూ పాడుతూ గెలుపొందింది. వారిని కట్టడి చేసేందుకు భారత బౌలర్లు శ్రమించారు. మొత్తం 6 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ టీం 136 పరుగులు చేసింది.

Read More : ICC Women’s World Cup : మహిళల వన్డే ప్రపంచ కప్.. కష్టాల్లో భారత్ 128/8

ఇంగ్లాండ్ ఓపెనర్, Tammy Beaumont, Danni Wyatt కేవలం తలో ఒక్క పరుగు మాత్రమే చేసి అవుట్ అయ్యారు. నాలుగు పరుగులకే రెండు ప్రధాన వికెట్లు కోల్పోయింది. దీంతో భారత శిబిరంలో సంతోషం వ్యక్తమయ్యింది. కానీ.. వీరి సంతోషానికి కెప్టెన్ Heather Knight చెక్ పెట్టారు. భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ..బ్యాట్ ఝలిపించారు. ఈ క్రీడాకారిణికి Nat Sciver చక్కటి సహకారం అందించారు. మరో వికెట్ పోకుండా జాగ్రత్తగా ఆడారు. వీరిద్దరినీ విడదీయడానికి భారత బౌలర్లు చెమటోడ్చారు. 69 పరుగుల వద్ద Nat Sciver (45) వికెట్ కోల్పోయింది. హాఫ్ సెంచరీ సాధించి Heather Knight మంచి జోరు కొనసాగించారు. అనంతరం వచ్చిన మిగతా మహిళా క్రీడాకారులు తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. జట్టుకు కావాల్సిన పరుగులను సాధించారు. Heather Knight 53 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. 31.2 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టు 136 పరుగులు చేసింది. ఫలితంగా భారత జట్టుపై 4 వికెట్లతో ఇంగ్లాండ్ గెలుపొందింది.

Read More : Women’s World Cup 2022 : వెస్టిండీస్‌‌పై భారత్ ఘన విజయం..చెలరేగిన స్మృతి, హర్మన్ ప్రీత్

భారత్ కు ఇంగ్లాడ్ బౌలర్లు చుక్కలు చూపించారు. వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో రాణించిన స్మృతి మంధాన, హర్మన్ ప్రీత్ కౌర్ లు ఈ మ్యాచ్ లో ఘోరంగా విఫలం చెందారు. కెప్టెన్ మిథాలీ రాజ్ కేవలం ఒక్క పరుగు చేసి వెనుదిరిగారు. ఓపెనర్ స్మృతి మంధాన, యాస్తిక భాటియా ఆటను ప్రారంభించారు. జట్టు స్కోరు 18 పరుగుల వద్ద భాటియా (8) వికెట్ కోల్పోయింది. అనంతరం బ్యాటింగ్ వచ్చిన మిథాలీ రాజ్ కేవలం ఒకేఒక్క పరుగు సాధించి అలా వచ్చి.. ఇలా వెళ్లిపోయారు. దీప్తి శర్మ డకౌట్ కాగా… హర్మన్ ప్రీత్ కౌర్..స్మృతి మంధానకు జత కలిశారు. వికెట్ పోకుండా నిలకడగా ఆడారు. జట్టు స్కోరు 50 పరుగులు దాటింది. జట్టు స్కోరు 61 పరుగుల వద్ద హర్మన్ ప్రీత్ కౌర్ (14) అవుట్ అయ్యారు. వెంటనే స్నేహ్ రానా (0) పెవిలియన్ చేరారు. ఒంటరిగా రాణించిన మంధాన (35) కూడా అవుట్ అవడంతో క్రీడాభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు. చివరిలో రిచా ఘోష్ జట్టు స్కోరు పెంచడానికి కృషి చేశారు. 33 పరుగులు సాధించిన రిచా రనౌట్ అయ్యారు. పూజా (6), జూలన్ గోస్వామి (20), మేఘనా సింగ్ (3), రాజేశ్వరీ గైక్వాడ్ (1) సాధించి అవుట్ అయ్యారు. దీంతో భారత మహిళల టీం 36.2 ఓవర్లలో 134 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. ఇప్పటి వరకు జరిగిన మూడు మ్యాచ్ ల్లో భారత మహిళా టీం రెండింటిలో గెలిచింది.

ట్రెండింగ్ వార్తలు