IND-W Vs BAN-W : ఒత్తిడిలో భార‌త్ చిత్తు.. 9 ప‌రుగుల‌కే 4 వికెట్లు.. మూడో వ‌న్డే టై.. సిరీస్ స‌మం

టీమ్ఇండియా, బంగ్లాదేశ్ మ‌హిళ‌ల జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన మూడో వ‌న్డే టైగా ముగిసింది. ఫ‌లితంగా మూడు వ‌న్డేల సిరీస్ కూడా 1-1 తో స‌మ‌మైంది. భార‌త్‌, బంగ్లాదేశ్‌లు సంయుక్తంగా ట్రోఫీని సొంతం చేసుకున్నాయి.

IND-W Vs BAN-W

IND-W Vs BAN-W : టీమ్ఇండియా, బంగ్లాదేశ్ మ‌హిళ‌ల జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన మూడో వ‌న్డే టైగా ముగిసింది. ల‌క్ష్య ఛేద‌న‌లో 10 ప‌రుగులు చేస్తే విజ‌యం భార‌త్ దే. చేతిలో నాలుగు వికెట్లు ఉన్నాయి. అయితే ఒత్తిడికి గురైన భార‌త్‌ చివ‌రికి 9 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. దీంతో మ్యాచ్ టై అయ్యింది. ఫ‌లితంగా మూడు వ‌న్డేల సిరీస్ కూడా 1-1 తో స‌మ‌మైంది. భార‌త్‌, బంగ్లాదేశ్‌లు సంయుక్తంగా ట్రోఫీని సొంతం చేసుకున్నాయి. తొలి వ‌న్డేలో బంగ్లాదేశ్ విజ‌యం సాధించ‌గా రెండో వ‌న్డేలో భార‌త్ గెలిచింది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ మొద‌ట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత‌ 50 ఓవర్లలో 4 వికెట్లు న‌ష్ట‌పోయి 225 పరుగులు చేసింది. ఫర్గానా హక్ (107; 160 బంతుల్లో 7 ఫోర్లు) శ‌త‌కంతో చెలరేగ‌గా, షమీమా సుల్తానా (52; 78 బంతుల్లో 5 ఫోర్ల‌) హాఫ్ సెంచ‌రీతో రాణించింది. టీమ్ఇండియా బౌలర్లలో స్నేహ్ రాణా రెండు వికెట్లు తీయ‌గా, దేవిక ఓ వికెట్ ప‌డ‌గొట్టింది. అనంత‌రం లక్ష్యఛేదనలో భార‌త్‌ 49.3 ఓవర్లలో 225 పరుగులే చేసింది.

Wrestlers: ఆసియన్స్ గేమ్స్‌కు భజరంగ్, వినేశ్ ఫొగట్‌.. పిటిషన్లు కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు

టీమ్ఇండియా బ్యాట‌ర్ల‌లో స్మృతి మంధాన (59; 85 బంతుల్లో 5 ఫోర్లు), హర్లీన్ డియోల్ (77; 108 బంతుల్లో 9 ఫోర్లు) అర్ధ శతకాలతో రాణించారు. ఆఖ‌ర్లో జెమీమా రోడ్రిగ్స్ (33 నాటౌట్; 45 బంతుల్లో) చివరి వరకు పోరాడింది. ఆఖ‌రి ఓవ‌ర్‌లో భార‌త్ విజ‌యానికి మూడు ప‌రుగులు అవ‌స‌రం కాగా.. చేతిలో ఓ వికెట్ మాత్ర‌మే ఉంది. తొలి రెండు బంతులకు రెండు పరుగులు వచ్చాయి.

Herchelle Gibbs: ఐసీసీ ప్రపంచ కప్-2023.. తీవ్ర ఒత్తిడిలో టీమిండియా: హెర్చెల్ గిబ్స్ కామెంట్స్

అయితే.. మూడో బంతికి మేఘన సింగ్ ఔటైంది. దీంతో మ్యాచ్ టై అయింది. ష‌ఫాలీ వర్మ (4), యక్షిత భాటియా (4), కెప్టెన్ హర్మన్ ప్రీత్ (14), దీప్తి శర్మ (1) లు విఫ‌లం అయ్యారు. బంగ్లాదేశ్ బౌల‌ర్ల‌లో న‌హీదా అక్త‌ర్ మూడు, మరుఫా అక్త‌ర్ రెండు వికెట్లు తీయ‌గా, సుల్తానా, ర‌బేయా, ఫ‌హిమా త‌లా ఓ వికెట్ తీశారు.

ట్రెండింగ్ వార్తలు