IND vs WI ODI Match : చరిత్ర సృష్టించిన జడేజా, కుల్దీప్ జోడీ.. వన్డే క్రికెట్‌లో ఇలా జరగడం ఇదే తొలిసారి.. బీసీసీఐ వీడియో వైరల్

వన్డే క్రికెట్ చరిత్రలో ఐదు వికెట్ల పతనం తరువాత మిగిలిఉన్న బంతుల పరంగా ఇది రెండో అతిపెద్ద విజయం. 2013లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో శ్రీలంక 180 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది.

Kuldeep Yadav and Ravindra Jadeja

Kuldeep Yadav – Ravindra Jadeja : ఇండియా వర్సెస్ వెస్టిండీస్ జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి వన్డే గురువారం రాత్రి జరిగింది. బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్‌లో జరిగిన ఈ వన్డేలో భారత్ ప్లేయర్స్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. దీంతో టీమిండియా 163 బంతులు మిగిలి ఉండగానే ఐదు వికెట్లు కోల్పోయి ఘన విజయం సాధించింది. వెస్టిండీస్ పై వన్డేల్లో టీమిండియాకు ఇది వరుసగా 9వ విజయం కావటం గమనార్హం. అయితే, ఈ వన్డేలో టీమిండియా పలు రికార్డులను క్రియేట్ చేసింది. ముఖ్యంగా కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా జోడీ ఈ వన్డేలో చరిత్ర సృష్టించారు. ఈ స్పిన్ జోడీ ప్రపంచ రికార్డును నెలకొల్పారు.

Kuldeep Yadav – Ravindra Jadeja

వెస్టిండీస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా జోడీ ఏడు వికెట్లు తీసింది. కుల్దీప్ నాలుగు వికెట్లు తీయగా, రవీంద్ర జడేజా మూడు వికెట్లు తీశాడు. దీంతో వన్డే క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు కలిసి ఒకే మ్యాచ్‌లో ఏడు వికెట్లు తీసి ప్రపంచ రికార్డును నెలకొల్పినట్లు బీసీసీఐ స్వయంగా వెల్లడించింది. ఇదిలాఉంటే బీసీసీఐ తన అధికారిక ట్విటర్ ఖాతాలో కుల్దీప్ ను జడేజా ఇంటర్వ్యూ చేస్తున్న వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో కుల్దీప్ ను జడేజా ఆటపట్టించే ప్రయత్నం చేయగా.. అంతా జిడ్డూ భయ్యా నుంచే నేర్చుకున్నా అంటూ కుల్దీప్ చెప్పాడు. ఈ వీడియోలో ఇద్దరు స్పిన్నర్లు సరదాగా మాట్లాడుకోవటం చూడొచ్చు.

 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు జడేజా, కుల్దీప్ యాదవ్ స్పిన్ ద్వయాన్ని తట్టుకోలేకపోయింది. ఇద్దరు స్పిన్నర్లు పదునైన బంతులను సంధించడంతో విండీస్ బ్యాటర్లు వెంటవెంటనే పెవిలియన్ బాట పట్టారు. దీంతో కేవలం 23 ఓవర్లలో 114 పరుగులకే విండీస్ ఆలౌట్ అయింది. ఆ తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ జట్టు.. 22.5 ఓవర్లకు ఐదు వికెట్లు కోల్పోయి 115 పరుగుల లక్ష్యాన్ని చేధించింది. వన్డే క్రికెట్ చరిత్రలో ఐదు వికెట్ల పతనం తరువాత మిగిలిఉన్న బంతుల పరంగా ఇది రెండో అతిపెద్ద విజయం. 2013లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో శ్రీలంక 180 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది.

ట్రెండింగ్ వార్తలు