Rohit Sharma: జడేజాకూడా ఆడటం లేదు.. అతని గురించి అడగరేం? కోహ్లీ గురించి ప్రశ్నించగా రోహిత్ రియాక్షన్

వన్డేల్లో నాలుగో స్థానం విషయంలో సమస్య చాన్నాళ్లుగా ఉంది. యువరాజ్ సింగ్ తరువాత ఎవ్వరూ ఆ స్థానంలో నిలదొక్కుకోలేదు. జట్టులో ఎప్పుడూ ఎవరి స్థానాలకూ గ్యారెంటీ ఉండదు.

Rohit Sharma

Team india Captain Rohit Sharma: ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023 (ICC World Cup 2023) మరో రెండు నెలల్లో ఇండియా (india) వేదికగా జరగబోతుంది. స్వదేశంలో జరుగుతున్న మెగా‌టోర్నీలో విజేతగా నిలిచేందుకు టీమిండియా (Team india) ఆటగాళ్లు పట్టుదలతో ఉన్నారు. ఇటీవలే రోహిత్ శర్మ (Rohit Sharma) నేతృత్వంలో వెస్టిండీస్ జట్టు (West Indies team) తో టెస్ట్, వన్డే సిరీస్‌ను టీమిండియా ఆడింది. రెండు సిరీస్‌లను గెలుచుకుంది. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా (Hardik Pandya) సారథ్యంలో వెస్టిండీస్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ ఆడుతుంది. ఈ సిరీస్‌కు రోహిత్, విరాట్ కోహ్లీ (Virat Kohli)కి విశ్రాంతి లభించింది. దీంతో రోహిత్ శర్మ ముంబైకి చేరుకున్నాడు. తాజాగా ఓ ఈవెంట్‌లో పాల్గొన్న రోహిత్ పలు విషయాలపై మీడియాతో మాట్లాడారు.

Rohit Sharma : రోహిత్ శ‌ర్మ కారు నంబ‌ర్‌కి అత‌డి రికార్డుకు ఉన్న సంబంధం తెలుసా..?

జడేజా గురించి అడగరేం?

నేనింత వరకు వన్డే ప్రపంచకప్‌ను అందుకోలేదు. అది నాకొక కల. దానికోసం పారాడటం నాకెంతో ఆనందాన్ని ఇస్తుంది. 2011లో ప్రపంచ కప్ గెలిచి తరువాత మళ్లీ మాజట్టు కప్పును అందుకోలేదు. ఈసారి అందుకోసం శ్రమిస్తున్నాం అని రోహిత్ శర్మ చెప్పారు. ఈ క్రమంలో గత ఏడాది టీ20 ప్రపంచకప్‌కు ముందు వన్డేలు ఆడటం తగ్గించాం. ఇప్పుడు వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో చాలా మంది టీ20లు ఆడట్లేదు. రెండేళ్ల ముందే ఈ విషయంలో ప్రణాళికలు వేసుకున్నాం అని రోహిత్ చెప్పారు. అయితే, మీరు, కోహ్లీ టీ20ల్లో ఎందుకు ఆడటం లేదని విలేకరులు ప్రశ్నించగా.. అందుకు రోహిత్ కాస్త ఘాటుగా స్పందించారు. నేను, కోహ్లీ టీ20లు ఆడకపోవటం గురించి అందరూ అడుగుతున్నారు.. కానీ, జడేజా కూడా టీ20ల్లో ఆడట్లేదు అతన్ని అడగరేం అంటూ రోహిత్ ప్రశ్నించాడు.

Tilak varma : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ రేసులో హైద‌రాబాదీ కుర్రాడు..? క‌ష్ట‌మే అయినా అసాధ్యం కాదు..!

జట్టులో ఎవరి స్థానానికి గ్యారెంటీ లేదు..

వన్డేల్లో నాలుగో స్థానం విషయంలో సమస్య చాన్నాళ్లుగా ఉంది. యువరాజ్ సింగ్ తరువాత ఎవ్వరూ ఆ స్థానంలో నిలదొక్కుకోలేదు. జట్టులో ఎప్పుడూ ఎవరి స్థానాలకూ గ్యారెంటీ ఉండదు. చివరికి నా విషయంలోనూ అంతే. శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్‌కు పెద్ద గాయాలే అయ్యాయి. శస్త్రచికిత్సలు జరిగాయి. నాలుగు నెలల పాటు ఆటకు దూరంగా ఉన్నారు. ఇలాంటి స్థితి నుంచి పునరాగమనం చేయడం తేలిక కాదు. మరి వాళ్లెలా స్పందిస్తారో చూడాలి అని రోహిత్ చెప్పారు. ఆసియా కప్, వన్డే ప్రపంచ కప్ ఇలా మెగా టోర్నీలు ముందున్నాయి. ఆసియా కప్ టోర్నీకి జట్టు ఎంపిక త్వరలోనే జరుగుతుందని రోహిత్ చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు