Jai Bhim: చరిత్ర సృష్టించిన జైభీమ్.. 26 ఏళ్ల రికార్డ్ బద్దలు!

ఇప్పుడు ఎక్కడ విన్నా జై భీమ్ సినిమా గురించే వినిపిస్తుంది. తమిళ హీరో సూర్య నటించి ఓటీటీలో విడుదలై భారీ విజయాన్ని నమోదు చేసుకున్న జై భీమ్ సినిమా ఇప్పుడు విమర్శకుల ప్రశంసలు..

Jai Bhim: ఇప్పుడు ఎక్కడ విన్నా జై భీమ్ సినిమా గురించే వినిపిస్తుంది. తమిళ హీరో సూర్య నటించి ఓటీటీలో విడుదలై భారీ విజయాన్ని నమోదు చేసుకున్న జై భీమ్ సినిమా ఇప్పుడు విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది. ఇది ఒక సినిమా కాదు.. 28 ఏళ్ల క్రితం జరిగిన వాస్తవ ఘటన ఆధారంగా తెరకెక్కిన దీన విజయగాధ. ఈ సినిమా చూసిన ప్రముఖులు సైతం దర్శకుడు జ్ఞానవేల్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Sankranti 2022: భీమ్లా కూడా విత్ డ్రా?.. వార్ వన్ సైడ్ అవుతుందా?

ఈ నెల 2వ తేదిన అమెజాన్‌ ప్రైమ్ ఓటీటీలో విడుదలైన ఈ సినిమా వారం రోజులు గడిచినా అదే జోష్ తో వ్యూస్ లో దూసుకుపోతుంది. మౌత్ పబ్లిసిటీ ద్వారానే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టింది. తాజాగా ఈ సినిమా ఓ సరికొత్త రికార్డును సృష్టించింది. ప్రముఖ మూవీ రేటింగ్ సంస్థ ఐఎండీబీ సినిమాల జాబితాలో ‘జై భీమ్‌’ టాప్‌-1 స్థానాన్ని కైవసం చేసుకుంది. దాదాపుగా 26 ఏళ్ల తరవాత ఈ రికార్డు తిరగరాయడం విశేషం.

Bigg Boss 5: శ్రీరామ్‌కు సోనూ సపోర్ట్.. టైటిల్ కొట్టడం ఖాయమా?

ఇప్పటివరకు ఐఎండీబీ సినిమాల జాబితాలో తొలిస్థానంలో 1994లో విడుదలైన ‘ది షాషాంక్ రిడంప్షన్’ సినిమాకి ఉంది. కాగా, ఇప్పుడు ఆ సినిమాను జై భీమ్ సొంతం చేసుకుంది. ఈ సినిమా 53 వేలకు పైగా ఓట్లతో 9.6 రేటింగ్‌తో జై భీమ్ మొదటి స్థానంలో నిలవగా ‘ది షాషాంక్ రిడంప్షన్’ రెండవ స్థానానికి పడిపోయింది.

ట్రెండింగ్ వార్తలు