Brahma Anandam : తాత మనవళ్లుగా రాబోతున్న తండ్రీకొడుకులు.. ‘బ్రహ్మా ఆనందం’..

తాజాగా రాజా గౌతమ్ తన నెక్స్ట్ సినిమాని అనౌన్స్ చేస్తూ తండ్రి బ్రహ్మానందం, వెన్నెల కిషోర్ తో కలిసి ఓ ఆసక్తికర వీడియోని రిలీజ్ చేశారు.

Brahma Anandam : బ్రహ్మానందం ఎన్నో ఏళ్లుగా కామెడీతో మనల్ని నవ్విస్తూనే ఉన్నారు. ప్రస్తుతం మాత్రం బ్రహ్మానందం అడపాదడపా సినిమాలు చేస్తున్నారు. ఇక బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ హీరోగా ఎప్పుడో ఒక సినిమా చేస్తూ ఉంటాడు. 2018లో మను అనే సినిమాతో పలకరించిన రాజా గౌతమ్ ఆరేళ్ళ తర్వాత మళ్ళీ సినిమాతో రాబోతున్నాడు. ఈ సారి ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ సినిమాతో ఆరాబోతున్నాడు.

తాజాగా రాజా గౌతమ్ తన నెక్స్ట్ సినిమాని అనౌన్స్ చేస్తూ తండ్రి బ్రహ్మానందం, వెన్నెల కిషోర్ తో కలిసి ఓ ఆసక్తికర వీడియోని రిలీజ్ చేశారు. ఈ వీడియోలో రాజా గౌతమ్, వెన్నెల కిషోర్ కలిసి బ్రహ్మానందంను తాత పాత్రకు ఒప్పిస్తున్నట్టు ఉంది. రాజా గౌతమ్ హీరోగా, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలో, రాజా గౌతమ్ కి తాత పాత్రలో బ్రహ్మానందంగా నేడు సినిమాని ప్రకటించారు. ఈ సినిమాకు టైటిల్ ‘బ్రహ్మా ఆనందం’ అని ప్రకటించడం గమనార్హం.

Also Read : Navatihi Utsavam : తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక – నవతిహి ఉత్సవం 2024.. డేట్ ఫిక్స్.. ఎప్పుడు? ఎక్కడ?

మళ్ళీ రావా, మసూద, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ.. లాంటి సూపర్ హిట్ సినిమాలు తీసిన స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ నిర్మాణంలో రాహుల్ యాదవ్ నక్కా నిర్మాతగా కొత్త దర్శకుడు RVS నిఖిల్ దర్శకత్వంలో ఈ బ్రహ్మా ఆనందం సినిమాని తెరకెక్కిస్తున్నారు. చిన్న సినిమాలతో వరుస హిట్స్ కొడుతున్న నిర్మాత రాజా గౌతమ్ తో సినిమా తీస్తుండటం, అంతేకాకుండా రియల్ లైఫ్ తండ్రీకొడుకులు సినిమాలో తాత మనవాళ్లుగా నటిస్తుండటంతో ఈ సినిమాపై ఇప్పట్నుంచే అంచనాలు నెలకొన్నాయి.

త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టనున్నారు. ఇప్పుడే రిలీజ్ డేట్ కూడా ప్రకటించడం విశేషం. 6 డిసెంబర్ 2024న ఈ సినిమాని థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. మరోసారి బ్రహ్మానందం ఈ సినిమాతో తెరపై ప్రేక్షకులను అలరించనున్నారు.

ట్రెండింగ్ వార్తలు