Navatihi Utsavam : తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక – నవతిహి ఉత్సవం 2024.. డేట్ ఫిక్స్.. ఎప్పుడు? ఎక్కడ?
ఇటీవలే ఓ ప్రెస్ మీట్ పెట్టి 90 ఏళ్ళ వేడుకని నవతిహి ఉత్సవం పేరుతో ఘనంగా మలేషియాలో చేయబోతున్నామని ప్రకటించారు మంచు విష్ణు.

Manchu Vishnu Announced Telugu Film Industry 90 Years Event Navatihi Utsavam Date and Place
Navatihi Utsavam : ప్రస్తుతం తెలుగు సినిమా ఇంటర్నేషనల్ లెవెల్ లో అదరగొడుతుంది. గతంలో 75 ఏళ్ళ తెలుగు సినిమా అంటూ వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆ వేడుకల్లో తెలుగు సినీ పరిశ్రమ అంతా పాల్గొంది. ఇప్పుడు మరోసారి అలాంటి భారీ ఈవెంట్ ని చేయబోతున్నారు. టాలీవుడ్ మా అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు ఆధ్వర్యంలో ఈ ఈవెంట్ జరగనుంది.
గత కొన్ని రోజులుగా మంచు విష్ణు దీనిపై పనిచేస్తున్నారు. ఇటీవలే ఓ ప్రెస్ మీట్ పెట్టి 90 ఏళ్ళ వేడుకని నవతిహి ఉత్సవం పేరుతో ఘనంగా మలేషియాలో చేయబోతున్నామని ప్రకటించారు. తాజాగా మలేషియాలో దేనికి సంబంధించిన పనులు పూర్తిచేసి అక్కడ ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు మంచు విష్ణు.
Also Read : Sukumar – Allu Arjun : సుకుమార్‌తో బన్నీ మొత్తం 7 సినిమాలు చేయాలా? అప్పుడు ఇచ్చిన మాట..
మలేషియా కౌలాలంపూర్‌లో ఉన్న బుకిట్ జలీల్‌లోని ప్రతిష్టాత్మక నేషనల్ స్టేడియంలో జూలై 20, 2024న ఈ నవతిహి ఉత్సవం వేడుకని గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. ఈ వేడుకకు టాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన ఎంతోమంది సెలబ్రిటీలు హాజరు కానున్నారు. ఈ కార్యక్రమం గురించి చెప్పడానికి, ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేస్తున్న వారితో కలిసి మంచు విష్ణు మలేషియాలో ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసారు.
Movie Artist Association President @iVishnuManchu proudly unveils the captivating logo of #MAA Navatihi Utsavam from Kuala Lumpur, Malaysia! ?
The celebration of 90 glorious years of Telugu cinema, commemorating its rich history, ground-breaking achievements, and enduring… pic.twitter.com/8PLZLcEmyr
— Sai Satish (@PROSaiSatish) May 7, 2024
తెలుగు సినీ పరిశ్రమ మలేషియాలో ఘనంగా నిర్వహిస్తున్న ఈ నవతిహి ఉత్సవంకు మలేహియా టూరిజం సపోర్ట్ చేస్తుండటం గమనార్హం. మలేషియా టూరిజం, మా (MAA), స్థానిక ఈవెంట్ ఆర్గనైజర్ MC ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఈ గ్లోబల్ వేడుకను జులై 20న చేయబోతున్నారు. అలాగే ఈ నవతిహి ఉత్సవం కేవలం సినిమా ఈవెంట్ లానే కాకుండా మలేషియా, తెలుగు ప్రజల మధ్య అవగాహన, గౌరవాన్ని పెంచే సాంస్కృతిక కార్యక్రమంలా కూడా ఉండనుందని తెలిపారు.