Sukumar – Allu Arjun : సుకుమార్‌తో బన్నీ మొత్తం 7 సినిమాలు చేయాలా? అప్పుడు ఇచ్చిన మాట..

ఆర్య 20 ఏళ్ళ వేడుకలో సుకుమార్ మాట్లాడుతూ ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపారు.

Sukumar – Allu Arjun : సుకుమార్‌తో బన్నీ మొత్తం 7 సినిమాలు చేయాలా? అప్పుడు ఇచ్చిన మాట..

Sukumar Allu Arjun Combo Having Total 7 Movies Interesting thing Revealed by Sukumar

Updated On : May 8, 2024 / 9:09 AM IST

Sukumar – Allu Arjun : సుకుమార్ – అల్లు అర్జున్ కాంబినేషన్ ఎంత పెద్ద హిట్ అందరికి తెలిసిందే. వీళ్ళ కాంబోలో సినిమా వస్తుందంటే అంచనాలు పెరిగిపోతాయి. ఆర్య(Arya), ఆర్య 2, పుష్ప(Pushpa) సినిమాలు ఇప్పటికే మంచి విజయాలు సాధించగా త్వరలో వీళ్ళ కాంబోలో రాబోయే పుష్ప 2 సినిమా కోసం దేశమంతా ఎదురుచూస్తుంది. సుకుమార్ – బన్నీ కాంబో అంటే ఫ్యాన్స్ కి కూడా చాలా ఇష్టం. వీళ్ళ సినిమాల్లో పాటలు చాలా బాగుంటాయి.

బన్నీకి ఫస్ట్ పెద్ద హిట్ ఆర్య ఇచ్చి అభిమానులకు దగ్గర చేసాడు సుకుమార్. ఇక పుష్పతో పాన్ ఇండియా స్టార్ ని చేసాడు బన్నీని. అందుకే ఈ కాంబో అంటే అందరికి ఇష్టం. ఇక వీరిద్దరూ కూడా మంచి స్నేహితులు అయ్యారు. ఒకరిపై ఒకరికి ఉన్న ఇష్టాన్ని, అభిమానాన్ని ఇప్పటికే పలుమార్లు తెలిపారు. తాజాగా వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన మొదటి సినిమా ఆర్య 20 ఏళ్ళు పూర్తిచేసుకోవడంతో ఓ స్పెషల్ ఈవెంట్ ని ఏర్పాటు చేసారు. ఈ ఈవెంట్ కి ఆర్య సినిమాకు పనిచేసిన వాళ్లంతా హాజరయి సందడి చేసారు.

Also Read : Abhinaya Shree : ‘ఆ అంటే అమలాపురం’ సాంగ్ హీరోయిన్ గుర్తుందా? ఇప్పుడు ఎలా ఉందో చూడండి.. 20 ఏళ్ళ తర్వాత స్టేజిపై..

ఈ ఈవెంట్లో సుకుమార్ మాట్లాడుతూ ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపారు. సుకుమార్ మాట్లాడుతూ.. ఆర్య సినిమా షూటింగ్ టైంలో ఆర్య హిట్ అయితే బన్నీ నాతో ఏడు సినిమాలు తీయాలని మాట తీసుకున్నాడు అని తెలిపారు. దీంతో ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇప్పటికే సుకుమార్ – బన్నీ కాంబోలో ఆర్య, ఆర్య 2, పుష్ప రాగా త్వరలో పుష్ప 2 రాబోతుంది. దీంతో నాలుగు సినిమాలు పూర్తవుతాయి. మరి మిగతా మూడు సినిమాలు ఎప్పుడు వస్తాయో, అవి పుష్పని మించి ఉంటాయా, వీళ్లిద్దరి కాంబోలో మళ్ళీ మళ్ళీ సినిమాలు రావాలి అని అభిమానులు అంటున్నారు.