Abhinaya Shree : ‘ఆ అంటే అమలాపురం’ సాంగ్ హీరోయిన్ గుర్తుందా? ఇప్పుడు ఎలా ఉందో చూడండి.. 20 ఏళ్ళ తర్వాత స్టేజిపై..

తాజాగా అభినయశ్రీ మళ్ళీ తెలుగు ఈవెంట్లో కనిపించింది.

Abhinaya Shree Participated and Dance in Arya 20 Years Event

Abhinaya Shree : అల్లు అర్జున్(Allu Arjun) ఆర్య(Arya) సినిమా సాంగ్స్ చాలా పెద్ద హిట్ అయ్యాయి. ఇప్పటికి ఆ పాటలు వింటూనే ఉంటాయి. అందులో ఆ అంటే అమలాపురం.. సాంగ్ అయితే స్పెషల్ సాంగ్స్ లో ఓ ట్రెండ్ సెట్ చేసింది. ఈ సాంగ్ లో అభినయశ్రీ నటించింది. తమిళ్, తెలుగు, మలయాళం భాషల్లో స్పెషల్ సాంగ్స్ తో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది అభినయశ్రీ. ఆర్య సినిమాలో ఆ అంటే అమలాపురం.. సాంగ్ తో ఫుల్ పాపులర్ అయింది. ప్రస్తుతం అడపాదడపా సినిమాల్లో కనిపిస్తుంది. తెలుగులో సినిమా చేసి దాదాపు పదేళ్లు అయింది. ఇటీవల్ 2022లో తెలుగు బిగ్ బాస్ లో పాల్గొని అలరించింది.

 

తాజాగా అభినయశ్రీ మళ్ళీ తెలుగు ఈవెంట్లో కనిపించింది. ఆర్య సినిమా రిలీజయి 20 ఏళ్ళు అవడంతో ఓ స్పెషల్ ఈవెంట్ ని నిర్వహించగా మూవీ యూనిట్ అంతా హాజరయ్యారు. ఈ ఈవెంట్ కి అభినయశ్రీ కూడా వచ్చింది. అభినయశ్రీ అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయింది. స్టేజిపై మరో సారి 20 ఏళ్ళ తర్వాత ఆ అంటే అమలాపురం.. సాంగ్ కి డ్యాన్స్ కూడా వేసి అలరించింది. దీంతో ఈవెంట్లో అందరూ ఫుల్ హుషారు అయ్యారు. అభినయశ్రీని ఇప్పుడు ఇలా చూసి చాలా మారిపోయింది అని కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఈ ఈవెంట్లో అభినయశ్రీ మాట్లాడుతూ.. ఈ పాట నాకు లైఫ్ లో ఒక పెద్ద గిఫ్ట్. వేరే ఏదో షూట్ లో ఉంటే శంకర్ మాస్టర్ ద్వారా ఈ పాటకి డ్యాన్సర్ ని చూస్తున్నారని తెలిసి నాకు అఫర్ వచ్చింది. ఆరు రోజులు షూట్ చేసాము ట్రైన్ మీద. 3 గంటలకు పొద్దున్నే లేచి ఆరు గంటలకి రెడీగా ఉండే వాళ్ళం. ట్రైన్ 6 గంటలకు వచ్చేది. సరైన నిద్ర, ఫుడ్ లేదు ఆ ఆరు రోజులు. కానీ లైఫ్ టైం గుర్తుండిపోయే సాంగ్ వచ్చింది అని తెలిపారు.