JP Nadda: ఎన్డీఏ సమావేశంలో ఈ అంశాలపై చర్చిస్తాం.. ఇవే మాకు ముఖ్యం: జేపీ నడ్డా

ఎవరైనా ఎన్డీఏ‎లోకి రావచ్చని జేపీ నడ్డా అన్నారు.

JP Nadda

JP Nadda – NDA: ఎన్డీఏ (National Democratic Alliance) 25 ఏళ్లు పూర్తి చేసుకుంటుందని బీజేపీ (BJP) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ఎన్డీఏ అజెండా దేశ సేవ, అందరిని కలుపుకుని వెళ్లడమేనని తెలిపారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు అశోక హోటల్ లో ఎన్డీఏ పక్ష నేతల సమావేశం ఉంటుందని చెప్పారు. 38 ఎన్డీఏ పక్షపార్టీలు హాజరవుతాయని అన్నారు.

ఎన్డీఏ సిద్ధాంతాలు, పాలన కొనసాగింపుపై సమావేశంలో చర్చ ఉంటుందని జేపీ నడ్డా తెలిపారు. దేశ విస్తృత ప్రయోజనాలు తమకు ముఖ్యమని చెప్పారు. ఎన్డీఏ అధికారం కోసం కాకుండా దేశాన్ని బలోపేతం చేసేందుకు పనిచేస్తుందని చెప్పుకొచ్చారు. దేశ రాజ్యాంగాన్ని కాపాడుతుందని అన్నారు.

ఎవరైనా ఎన్డీఏ‎లోకి రావచ్చని జేపీ నడ్డా అన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని తెలిపారు. ఎన్డీఏలో ఎవరినీ వదిలేయలేదని అన్నారు. అందరితోనూ తాము స్నేహపూర్వకంగానే ఉన్నామని చెప్పారు. యూపీఏకి మాత్రం నీతి, నియమాలు లేవని అన్నారు.

Pawan Kalyan: ఢిల్లీ చేరుకుని కీలక వ్యాఖ్యలు చేసిన పవన్ కల్యాణ్

ట్రెండింగ్ వార్తలు