RRR Glimpse : గోండు బెబ్బులి గోళ్లు ఆ సినిమా నుండి తీసుకున్నారా?

‘ఆర్ఆర్ఆర్’ లో ఎన్టీఆర్ Wolverine వెపన్ వాడారా?..

RRR Glimpse: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, దర్శకధీరుడు రాజమౌళి కలయికలో.. డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ మీద దానయ్య నిర్మిస్తున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిలిం ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం).. సోమవారం సోషల్ మీడియాను షేక్ చెయ్యాలని ఫిక్స్ అయిపోయారు మూవీ టీం.

RRR Glimpse : గ్లింప్స్ గూస్ బంప్స్..

ఉదయం 11 గంటలకు రిలీజ్ చేసిన RRR Glimpse ట్రెండింగ్‌లో టాప్ ప్లేస్‌లో రికార్డ్ స్థాయి వ్యూస్ అండ్ లైక్స్ రాబడుతూ దూసుకెళ్తోంది. కేవలం 45 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో కంటి రెప్ప వేసే అంత గ్యాప్ కూడా ఇవ్వకుండా జెట్ స్పీడ్‌తో కట్ చేసిన షాట్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి.

RRR Glimpse : అసలు కథ ముందుంది..

ఇక ప్రతి షాట్‌ని స్క్రీన్ షాట్ తీసి నెట్టింట సందడి చేస్తున్నారు తారక్ – చరణ్ ఫ్యాన్స్. ఇప్పటికే కొన్ని పోలికలు, మీమ్స్ స్టార్ట్ చేసేశారు. యంగ్ టైగర్ ఓ యాక్షన్ సీన్‌లో చేతికి పదునుగా ఉన్న గోళ్లు వంటి వెపన్ పట్టుకుని ఉంటాడు.

RRR Glimpse : రికార్డుల హంటింగ్ స్టార్ట్ చేశారుగా!

అది పాపులర్ హాలీవుడ్ ఫిలిం X-Men Origins: Wolverine లో హగ్ జాక్‌మెన్ పట్టుకుని ఉన్న వెపన్ లాంటిదేనని పోలుస్తూ.. తన సినిమాల్లో వాడే వెపన్స్ మీద ప్రత్యేక దృష్టి పెట్టే జక్కన్న ఈసారి Wolverine వెపన్‌ను ఉపయోగించాడంటూ ట్రోల్స్ స్టార్ట్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు