×
Ad

Alia Bhatt : అలియా భట్ ఒక్క డ్రెస్ కోసం ఏకంగా 163 మంది.. 1905 గంటలు పనిచేశారట.. వైరల్ అవుతున్న ఫొటోలు..

తాజాగా అలియాభట్ న్యూయార్క్ లో జరిగే మెట్ గాలా ఈవెంట్ కి వెళ్ళింది. తన డ్రెస్ తో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది.

  • Published On : May 7, 2024 / 12:07 PM IST

Alia Bhatt Special Designer Saree Goes Viral from Met Gala 2024 Event

Alia Bhatt : బాలీవుడ్ భామ అలియా భట్ వరుస సినిమాలతో దూసుకుపోతుంది. బయట ఈవెంట్స్ లో కూడా రెగ్యులర్ గా కనపడి అలరిస్తుంది. RRRతో ఈ భామ తెలుగుకి కూడా పరిచయమైన సంగతి తెలిసిందే. ఇటీవల హార్ట్ ఆఫ్ స్టోన్ అనే ఓ అమెరికన్ సినిమాలో కనిపించిన ఆలియా త్వరలో జిఘ్ర సినిమాతో రాబోతుంది. మరోవైపు భర్త రణబీర్ కపూర్, పాప రాహాతో ఫ్యామిలీ లైఫ్ సంతోషంగా గడుపుతుంది.

తాజాగా అలియాభట్ న్యూయార్క్ లో జరిగే మెట్ గాలా ఈవెంట్ కి వెళ్ళింది. ఈ ఈవెంట్ కి అనేక సినీ పరిశ్రమల నుంచి, బిజినెస్ పరిశ్రమ నుంచి ఎంతోమంది సెలబ్రిటీలు వస్తారు. ఈ క్రమంలో అలియాభట్ వెళ్లగా తన డ్రెస్ తో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. సరికొత్త శారీ డిజైన్ చేసి కట్టుకెళ్లింది అలియా భట్. తన చీర చాలా పొడవుగా ఉంది. ఆ చీరకట్టులో మెట్ గాలా రెడ్ కార్పెట్ పై హొయలొలికించింది అలియా.

Also Read : Arya : ‘ఆర్య’ సినిమాకు అల్లు అర్జున్ కంటే ముందు అనుకున్న హీరోలు ఎవరో తెలుసా?

అయితే ఈ ఈవెంట్లో అలియా తన డ్రెస్ గురించి మాట్లాడుతూ.. ప్రముఖ డిజైన్ సబ్యసాచి ముఖర్జీ ఆధ్వర్యంలో 163 మంది చేతుల మీదుగా దాదాపు 1900 గంటలు పైగా కష్టపడి ఈ శారీని తయారుచేశారని తెలిపింది. బోలెడంత ఎంబ్రాయిడరీ వర్క్ తో సరికొత్తగా శారీ తయారుచేసారు. దీంతో అలియాభట్ ఫొటోలు, చీర ఫొటోలు వైరల్ గా మారాయి. ఇది తెలిసి ఒక్క చీర కోసం అంతమంది, అన్ని గంటలు కష్టపడ్డారా అని ఆశ్చర్యపోతున్నారు.