Director VN Aditya Sensational Comments on Uday Kiran
VN Aditya : నువ్ నేను, చిత్రం, మనసంతా నువ్వే, నీ స్నేహం. లాంటి సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులని మెప్పించి ఉదయ్ కిరణ్(Uday Kiran) మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ఆ తర్వాత వరుస ఫ్లాప్స్, ఫైన్షియల్ ఇబ్బందులు, పలు పర్సనల్ కారణాలతో డిప్రెషన్ కి వెళ్లి ఆత్మహత్య చేసుకొని అభిమానులకు, కుటుంబానికి తీవ్ర విషాదం మిగిల్చాడు.
ఉదయ్ కిరణ్ మరణించి చాలా ఏళ్ళు గడుస్తున్నా ఇప్పటికి అతని సినిమాలతో పాటు అతని గురించి మాట్లాడుతూనే ఉంటారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఉదయ్ కిరణ్ తో మనసంతా నువ్వే సినిమా తీసి భారీ హిట్ కొట్టిన దర్శకుడు VN ఆదిత్య ఉదయ్ కిరణ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసాడు.
Also Read : Arya : ‘ఆర్య’ సినిమాకు అల్లు అర్జున్ కంటే ముందు అనుకున్న హీరోలు ఎవరో తెలుసా?
VN ఆదిత్య మాట్లాడుతూ.. ఉదయ్ కిరణ్ చాలా మంచి మనిషి. సినిమాల్లో చూసినట్టే క్యూట్ బాయ్. చిన్న వయసులోనే పెద్ద సక్సెస్ చూసేసాడు. కానీ దాన్ని హ్యాండిల్ చేయలేకపోయాడు. ఆ తర్వాత వరుస ఫ్లాప్స్ ఇంకొన్ని ఇబ్బందులు రావడంతో తట్టుకోలేకపోయాడు. ముందు నుంచి కూడా ఉదయ్ కిరణ్ కి సూసైడ్ ఆలోచనలు ఉన్నాయి. ఇది నాకు, తేజకి, ఆర్పీ పట్నాయక్ కి తెలుసు. మేమంతా అతనితో మాట్లాడాము. దాని నుంచి బయటకి తీసుకురావడానికి ట్రై చేసాము. కానీ ఉదయ్ కిరణ్ అలా చేసేసాడు అని అన్నారు. దీంతో VN ఆదిత్య చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.