IPL 2024 : మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును బద్దలు కొట్టిన సంజు శాంసన్

ఐపీఎల్ చరిత్రలో మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును సంజూ శాంసన్ బద్దలు కొట్టాడు.

Sanju Samson Breaks MS Dhoni Record : ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది. 222 పరుగుల భారీ లక్ష్య చేధనలో రాజస్థాన్ రాయల్స్ జట్టు బ్యాటర్లు తడబడ్డారు. 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి కేవలం 201 పరుగులు మాత్రమే చేయగలిగారు. దీంతో ఢిల్లీ జట్టు 20 పరుగుల తేడాతో విజయం సాధించి ప్లే ఆఫ్స్ అవకాశాలను కాపాడుకుంది. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ కేవలం 46 బంతుల్లోనే 86 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సిక్సులు, ఎనిమిది ఫోర్లు ఉన్నాయి. ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలో మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును సంజూ బద్దలు కొట్టాడు.

Also Read : IPL 2024 : సంజూ పోరాటం వృథా.. ఉత్కంఠపోరులో ఢిల్లీదే గెలుపు

ఐపీఎల్ లో అత్యంత వేగంగా 200 సిక్సర్లు బాదిన భారతీయుడిగా సంజూ శాంసన్ నిలిచాడు. భారతీయ బ్యాటర్లలో ఐపీఎల్ చరిత్రలో మహేంద్ర సింగ్ ధోనీ 165 మ్యాచ్ లలో 200 సిక్సుల మైలురాయిని చేరుకున్నాడు. సంజూ శాంసన్ కేవలం 159 ఇన్నింగ్స్ లలోనే 200 సిక్సులు బాది ధోనీ రికార్డును అధిగమించాడు. విరాట్ కోహ్లీ 180 ఇన్నింగ్స్ లలో, రోహిత్ శర్మ 185 మ్యాచ్ లలో, సురేష్ రైనా 193 మ్యాచ్ లలో 200 సిక్సుల మైలురాయిని చేరుకున్నారు. మరోవైపు ఐపీఎల్ చరిత్రలో 200 లేదా అంతకంటే ఎక్కువ సిక్సర్లు బాదిన బ్యాటర్లలో 10వ స్థానంలో సంజూ నిలిచాడు.

Also Read : T20 World Cup 2024 : రోహిత్ శర్మ కెప్టెన్సీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన యువరాజ్ సింగ్

 

 

ట్రెండింగ్ వార్తలు