Jr NTR: నటరత్న, స్వర్గీయ నందమూరి తారక రామారావు వారసుల్లో ఆయన నటవారసత్వాన్ని, లక్షణాలను పుణికి పుచ్చుకుని తండ్రికితగ్గ తనయుడిగా, తిరుగులేని కథానాయకుడిగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనదైన ముద్రవేశారు ‘యువరత్న’ నందమూరి బాలకృష్ణ. ఇక రాజకీయాల సంగతి తెలిసిందే.
Unstoppable with NBK : నా లైఫ్‌లో మర్చిపోలేని పాత్ర అది : బాలకృష్ణ
ఆ తర్వాత నందమూరి వంశం నుండి మూడో తరం నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చి.. నూనుగు మీసాల ప్రాయంలోనూ ఇండస్ట్రీ రికార్డ్ కొట్టాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. తారక్ కెరీర్ స్టార్టింగ్ నుండి తనంతట తాను స్టార్డమ్ తెచ్చుకునే వరకు అతను రామారావు మనవడు, హరికృష్ణ కొడుకు అని చెప్పుకున్నాడు కానీ బాలయ్య చేరదీసిన తర్వాత పరిస్థితి వేరు.
Bangarraju Trailer : అక్కినేని తండ్రీకొడుకులు అదరగొట్టారుగా!
అయితే తారక్ సెకండ్ మూవీ ‘స్టూడెంట్ నెం.1’ నుండే బాలయ్య అభిమానులు అతణ్ణి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. గతకొంత కాలంగా బాబాయ్-అబ్బాయ్‌ల మధ్య విబేధాలున్నాయంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ చర్చించుకుంటున్న సంగతి తెలిసిందే. జూనియర్ ఫ్యాన్స్ అయితే బాలయ్యతో పాటుగా తారక్‌ని వాడుకుని వదిలేశారంటూ విమర్శలు చేశారు. అయితే తమ హీరోకి ‘హిట్స్ వచ్చాకే ఆ ఫ్యామిలీ కలిశారు.. అవసరం ఉన్నప్పుడే పిలుస్తారు’ అనే వ్యాఖ్యలకు సమాధానంగా సీనియర్ అభిమానులు కొందరు జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీ హిట్ కొట్టిన ‘సింహాద్రి’ సినిమా ఓపెనింగ్ అప్పటి రేర్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
NTR-RamCharan : ఎన్టీఆర్, రామ్‌చరణ్ స్నేహం చూస్తుంటే నాకు అసూయ కలుగుతుంది
‘సింహాద్రి’ ప్రారంభోత్సవానికి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అప్పటి సినిమాటోగ్రఫీ శాఖామంత్రి దేవేందర్ గౌడ్, దర్శకరత్న దాసరి, డైరెక్టర్ రాజమౌళి, నిర్మాత వి. దొరస్వామి రాజు తదితరులు హాజరైన ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. ‘జూనియర్ ఎన్టీఆర్‌ని మేం ముందు నుండే సపోర్ట్ చేస్తున్నాం.. కామెంట్స్ చేసేముందు వాస్తవాలు తెలుసుకోండి’ అంటూ బాలయ్య ఫ్యాన్స్ ఈ ఫొటోను తెగ షేర్ చేస్తున్నారు.
హిట్లు వచ్చాకే కలిసారు, అవసరం ఉన్నప్పుడే పిలుస్తారు, అని ఆకుకి పువ్వుకి తేడా తెలియని పిల్ల నాయల్లా కోసం, సింహాద్రి opening అప్పటి ఫోటో.
మేము స్టూడెంట్ No:1 నుండి కూడా సపోర్ట్, ప్రతీ మూవీ కి హడావిడి చేసేవాళ్ళము(నాగ, సుబ్బు ) బెనిఫిట్ షోP.S : చంద్రబాబు గారు అప్పుడు ముఖ్యమంత్రి pic.twitter.com/k9qlroefTE
— Raja (@rajadevendra) January 11, 2022
during simhadri time @ncbn with our @tarak9999 pic.twitter.com/nC2QTvJfy9
— నాగ్ చౌదరి (@NagChowdary_) January 10, 2022