Nuh violence : నుహ్‌లో కారుకు నిప్పు పెట్టిన దుండగులు.. తృటిలో తప్పించుకున్న మహిళా న్యాయమూర్తి, 3 ఏళ్ల చిన్నారి

ఒక ఊరేగింపును అడ్డుకునే ప్రయత్నంలో నుహ్‌లో చెలరేగిన హింస ఇంకా కొనసాగుతోంది. అల్లరి మూకలు ఓ కారుకు నిప్పు పెట్టడంతో అందులో ప్రయాణిస్తున్న న్యాయమూర్తి, ఆమె కుమార్తె తృటిలో తప్పించుకున్నారు.

Nuh violence

Nuh violence : హరియాణలోని నుహ్‌లో కొనసాగుతున్న హింస మధ్య ఓ మహిళా అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆమె మూడేళ్ల కుమార్తె ప్రయాణిస్తున్న కారుకు కొందరు దుండగులు నిప్పంటించారు. ఈ ఘటనలో వారిద్దరు తృటిలో తీవ్ర ప్రమాదం నుండి తప్పించుకున్నారు.

Gurugram : గురుగ్రామ్ మసీదుపై గుంపు దాడి..మసీదు దహనం, ఒకరి మృతి

విశ్వ హిందూ పరిషత్ ఊరేగింపును అడ్డుకునే ప్రయత్నంలో నుహ్‌లో చెలరేగిన ఘర్షణలు గురుగ్రామ్‌కు వ్యాపించి రెండురోజులుగా కొనసాగుతున్నాయి. ఇద్దరు హోంగార్డులు, ఒక మతాధికారితో సహా ఆరుగురు ఈ ఘర్షణల్లో చనిపోయారు.

 

నుహ్‌లో ఓ గుంపు కారుకు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (ACJM) అంజలి జైన్ ఆమె 3 సంవత్సరాల కుమార్తె తృటిలో తప్పించుకున్నారు. గుంపు వారిపై రాళ్లు రువ్వడం, కాల్పులు జరపడంతో ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెత్తాల్సి వచ్చిందని నుహ్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్ఐఆర్ ద్వారా తెలుస్తోంది. నూహ్ పాత బస్టాండ్‌లోని వర్క్ షాప్‌లో ఆశ్రయం పొందాల్సి వచ్చిందని .. ఆ తరువాత కొందరు న్యాయవాదులు వీరిని కాపాడినట్లు తెలుస్తోంది.

Monu Manesar: ఎవరు ఈ మోను మానేసర్..? గురుగ్రామ్‭ హింసకు సూత్రధారి అయిన ఇతడి గత చరిత్ర తెలుసా?

ఎఫ్ఐఆర్ ప్రకారం సోమవారం మధ్యాహ్నం 1 గంటల ప్రాంతంలో అంజలీ జైన్, ఆమె కుమార్తె, గన్ మ్యాన్ సియారామ్ తన ఫోక్స్ వ్యాగన్ కారులో మెడిసిన్స్ కొనుగోలు కోసం నల్హర్‌లోని SKM మెడికల్ కాలేజీకి వెళ్లారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో కాలేజీ నుంచి తిరిగి వస్తుండగా ఢిల్లీ-అల్వార్ రోడ్డులోని పాత బస్టాండ్ సమీపంలో సుమారు 100-150 మంది అల్లరి మూకలు వారిపైకి దాడి చేశారు. వారిపై రాళ్లు రువ్వారు. ప్రాణాలుకాపాడుకోవడానికి వారు పరుగులు తీసారు. కొందరు న్యాయవాదులు వారిని రక్షించడంతో ప్రాణాలతో బయటపడ్డారు. తరువాత రోజు కారును తనిఖీ చేయడానికి వెళ్తే దానిని అల్లరి మూకలు తగులబెట్టినట్లు ఎఫ్ఆర్ఆర్‌లో వెల్లడించారు. ఇక ఈ ఘటనలో దాడి చేసిన వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

ట్రెండింగ్ వార్తలు