Kajal Agarwal : తన అందం, శరీరంపై వచ్చిన కామెంట్లకు ఘాటుగా స్పందిస్తూ.. తల్లి పడే కష్టాన్ని చెప్పిన కాజల్

కాజల్ ప్రెగ్నెంట్ అవ్వడంతో సహజంగానే తన శరీరంలో, తన ముఖం పై కొన్ని మార్పులు వచ్చాయి. కొంతమంది నెటిజన్లు కాజల్ అందం పోతుందని, ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కూడా బాడీని, అందాన్ని...........

Kajal Agarwal :   సినీ పరిశ్రమలో దాదాపు 15 ఏళ్ళు లాంగ్ కెరీర్ ని కొనసాగించిన కాజల్ అగర్వాల్ స్టార్ హీరోయిన్ గా ఉన్నప్పుడే పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా కొన్ని సినిమాలు ఒప్పుకొని చేసింది. అయితే సినిమాలు చేస్తున్నప్పుడే కాజల్ కి ప్రెగ్నెన్సీ రావడంతో ప్రస్తుతానికి సినిమాలకి బ్రేక్ ఇచ్చింది. తల్లి కాబోతున్న కాజల్ తన ప్రెగ్నెన్సీ టైంని ఆస్వాదిస్తోంది. దీనిపై చాలా సంతోషంగా ఉంది. తాను తల్లి కాబోతున్నందుకు ఎంత సంతోషంగా ఉందో చెప్తూ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంది.

 

అయితే కాజల్ ప్రెగ్నెంట్ అవ్వడంతో సహజంగానే తన శరీరంలో, తన ముఖం పై కొన్ని మార్పులు వచ్చాయి. కొంతమంది నెటిజన్లు కాజల్ అందం పోతుందని, ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కూడా బాడీని, అందాన్ని కరెక్ట్ గా మెయింటైన్ చేయాలని కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది కాజల్ అందం పోతుందని మీమ్స్ చేస్తున్నారు. ఇవి చూసిన కాజల్ వీటిపై ఘాటుగా స్పందించింది. తన అందం పోతుంది, శరీరాకృతులు మారుతున్నాయి అన్నవారికి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టి కౌంటర్ ఇచ్చింది.

ఈ విషయంపై కాజల్ స్పందిస్తూ.. ”ప్రస్తుతం నేను నా జీవితంలో, నా శరీరంలో, నా ఇంట్లో, నేను పని చేసే ప్రదేశంలో అద్భుతమైన కొత్త కొత్త మార్పులు చూస్తున్నాను. ఇటీవల నేను కొన్ని కామెంట్‌లు, బాడీ షేమింగ్ మెసేజ్‌లు, మీమ్‌లు చూశాను. అవి నాకు ఎలాంటి సహాయం సహాయం చేయవు. అందరితో కొంచెం మంచిగా ఉండటం నేర్చుకోండి. మీకు అది కుదరకపోతే వాళ్ళ బతుకు వాళ్ళని బతకనివ్వండి. వాళ్ళ గురించి మీరు మాట్లాడటం అనవసరం.

Chiranjeevi : మళ్ళీ కమర్షియల్ యాడ్స్‌లోకి మెగాస్టార్??

ప్రస్తుతం నాలాంటి జీవిత పరిస్థితులను అనుభవిస్తున్న వారందరికి చెప్తున్నాను. మీరంతా ఇది చదవాలి. నా ఆలోచనలని ఇక్కడ పంచుకుంటున్నాను అలాగే ఇష్టమొచ్చిన కామెంట్స్ చేసే వాళ్ళు, అర్ధం చేసుకోలేని వాళ్ళు కూడా ఇది చదవాలి. గర్భధారణ సమయంలో మన శరీరాలు బరువు పెరగడంతో పాటు అనేక మార్పులకు గురవుతాయి. హార్మోన్ల మార్పులు కలుగుతాయి. శిశువు పెరిగేకొద్దీ మన కడుపు మరియు ఇతర బాడీ పార్ట్స్ పెద్దవిగా మారతాయి. మన శరీరం అన్నిటికి రెడీ అయి ఉంటుంది. కొంతమందికి శరీరం మీద స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడవచ్చు. కొన్నిసార్లు మొటిమలు కూడా రావొచ్చు. మాములు టైం కంటే కూడా ఇలాంటప్పుడు ఎక్కువగా అలసిపోతాము. మా మైండ్ లో మానసిక సంఘర్షణ జరుగుతుంది. మా శరీరాల గురించి అనారోగ్యకరమైన లేదా ప్రతికూల ఆలోచనలు వస్తాయి.

Akshay Kumar : ఉత్తరాఖండ్ బ్రాండ్ అంబాసిడర్‌గా అక్షయ్ కుమార్

అలాగే ప్రసవించిన తర్వాత మనం అంతకు ముందు ఉన్నలా మారడానికి కొంత సమయం పట్టవచ్చు లేదా అసలు అంతకుముందులా అవ్వకపోవచ్చు కూడా. ఈ మార్పులు చాలా సహజమైనవి. మన జీవితాల్లోని అన్ని కొత్త మార్పులని ఎదుర్కోవటానికి మనం కష్టపడుతున్నప్పుడు, ముఖ్యంగా మనం మన పిల్లల కోసం ఎదురు చూస్తున్నప్పుడు మనం అసాధారణంగా భావించాల్సిన అవసరం లేదు. మన జీవితంలో తల్లి కావడం అనే అత్యంత అందమైన, అద్భుతం మరియు విలువైన దశలో మనం అసౌకర్యంగా లేదా ఒత్తిడికి గురికావలసిన అవసరం లేదు. చిన్న శిశువుకు జన్మనిచ్చే మొత్తం ప్రక్రియ, మనం అనుభవించే విశేషమైన వేడుక అని మనం గుర్తుంచుకోవాలి.” అని తెలిపింది. అంతే కాక ఇలాంటి టైములో తల్లి కాబోయే వాళ్ళు ఎలా ఉండాలో కొన్ని పాయింట్స్ ని కూడా కామెంట్స్ లో చెప్పింది. నాతో పాటు ఈ అద్భుతమైన దశలో ఉన్న వారికి ఈ పోస్ట్ సహాయపడుతుందని ఆశిస్తున్నాను. మీ అందరికి నా ప్రేమని పంచుతున్నాను అంటూ పోస్ట్ చేసింది కాజల్.

ఇలా ఒకపక్క కామెంట్స్ చేసిన వారికి కౌంటర్లు ఇస్తూనే తల్లి గొప్పతనం గురించి, తల్లి కాబోయేటప్పుడు కాబోయే జాగ్రత్తల గురించి చాలా బాగా చెప్పింది కాజల్. దీంతో మాములు నెటిజన్ల నుండి సెలబ్రిటీల వరకు అందరూ కాజల్ ని అద్భుతంగా చెప్పావు అంటూ పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు