Kanti Velugu: తెలంగాణలో నేటి నుంచి కంటి వెలుగు పరీక్షల నిర్వహణ

తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి ‘కంటి వెలుగు’ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వ అధికారులు ఏర్పాట్లన్నింటినీ పూర్తి చేశారు. 18 ఏళ్లు పైబడిన వారు అందరూ ఉచితంగా కంటి పరీక్షలు చేయించుకోవచ్చు. ఇందుకు కోసం ప్రభుత్వ సిబ్బంది శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు. ‘కంటి వెలుగు’ రెండో విడత కింద 100 రోజుల పాటు ఈ శిబిరాలను ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహిస్తారు.

Kanti Velugu: తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి ‘కంటి వెలుగు’ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వ అధికారులు ఏర్పాట్లన్నింటినీ పూర్తి చేశారు. 18 ఏళ్లు పైబడిన వారు అందరూ ఉచితంగా కంటి పరీక్షలు చేయించుకోవచ్చు. ఇందుకు కోసం ప్రభుత్వ సిబ్బంది శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు. ‘కంటి వెలుగు’ రెండో విడత కింద 100 రోజుల పాటు ఈ శిబిరాలను ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహిస్తారు.

శని, ఆది వారాలు, సెలవు దినాల్లో మాత్రం నిర్వహించరు. అవసరమైన వారికి కళ్లద్దాలు, ఔషధాలు పంపిణీ చేస్తారు. అవసరమైన వారికి శస్త్రచికిత్స కూడా చేయిస్తారు. రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి 16,556 ప్రాంతాల్లో శిబిరాలు నిర్వహిస్తారు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 241 ప్రాంతాల్లో కలిపి 5,058 శిబిరాలను ప్రభుత్వం నిర్వహించనుంది.

పరీక్షలు చేయించుకోవడానికి వచ్చేవారు ఆధార్‌ లేదా రేషన్‌ కార్డు వంటి ఏదో ఒక గుర్తింపు కార్డును తెచ్చుకోవాల్సి ఉంటుంది.తెలంగాణ వ్యాప్తంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆయా ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభిస్తారు. అధికారులు పలు కేంద్రాల్లో ఇప్పటికే మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ఏఎన్ఎంలు కంటి వెలుగు స్లిప్పులు పంపిణీ చేస్తున్నారు.

BJP Slams KCR: వారితో సభలో పాల్గొన్నంత మాత్రాన తెలంగాణలో కేసీఆర్ ఓటు బ్యాంకు పెరుగుతుందా?: బీజేపీ

ట్రెండింగ్ వార్తలు