Kunaram Rice Varieties : ఖరీఫ్ కు అనువైన కూనారం పరిశోధనా స్థానం వరి రకాలు.. ఎకరాకు 40 నుండి 45 బస్తాల దిగుబడి

తెలంగాణలో బోర్లు బావుల కింద అధికంగా వరి సాగు వున్న నేపధ్యంలో రైతులు ఎక్కువగా స్వల్ప, మధ్యకాలిక రకాలను సాగు చేస్తున్నారు. వీటి కాలపరిమితి 120 నుండి 135 రోజులు వుంటుంది. కాలువల కింద సాగుచేసే రైతులు మాత్రం దీర్ఘకాలిక రకాలను 145 నుండి 155 రోజుల కాలపరిమితి గల రకాలను సాగుచేస్తున్నారు.

High Yielding Paddy Variety

Kunaram Rice Varieties : ఖరీఫ్ సమయం దగ్గరపడుతోంది. ఈ సమయంలో రైతులు ఆయాప్రాంతాలకు అనుగుణంగా శాస్త్రవేత్తలు రూపొందించిన వరి వంగడాల పట్ల అవగాహన పెంపొందించుకోవాలి. అనేక కొత్త వంగడాలు ప్రస్తతం అందుబాటులోకి వచ్చాయి. అలాగే పాతవాటిలో కూడా మంచి దిగుబడినిచ్చే సామర్థ్యం కలిగిన వరి రకాలు వున్నాయి.  సన్నగింజ , దొడ్డుగింజ వరి రకాల్లో కూనారం వరి పరిశోధనా స్థానం రూపొందించిన వంగడాలు రైతుల ఆదరణ పొందుతున్నాయి. మరి వీటి గుణగణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

READ ALSO : Coriander Cultivation : కొబ్బరిలో అంతర పంటగా కొత్తిమీర సాగు.. తక్కువ సమయంలోనే అధిక లాభాలు ఆర్జిస్తున్న రైతు

తెలంగాణలో బోర్లు బావుల కింద అధికంగా వరి సాగు వున్న నేపధ్యంలో రైతులు ఎక్కువగా స్వల్ప, మధ్యకాలిక రకాలను సాగు చేస్తున్నారు. వీటి కాలపరిమితి 120 నుండి 135 రోజులు వుంటుంది. కాలువల కింద సాగుచేసే రైతులు మాత్రం దీర్ఘకాలిక రకాలను 145 నుండి 155 రోజుల కాలపరిమితి గల రకాలను సాగుచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని కోస్తాలో అధిక శాతం కాలువల కింద వరి సాగవుతుంది.

READ ALSO : High Yield Rice Crops : అధిక దిగుబడినిచ్చే దొడ్డుగింజ వరి రకాలు

కనుక ఖరీఫ్ లో ఎక్కువగా 135 నుండి 160 రోజుల కాలపరిమితి కలిగిన రకాలను సాగుచేస్తారు. అయితే దీర్ఘకాలిక రకాలు సాగుచేసే ప్రాంతంలో ఒకరిద్దరు స్వల్పకాలిక రకాలు సాగుచేస్తే కోత సమయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల ప్రాంతాల వారిగా, సాగుచేసే పరిస్థితులను బట్టి రకాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలి. పెద్దపల్లి జిల్లా, కూనారం వరి పరిశోధనా స్థానం నుండి ఇటీవల విడుదలైన కె.ఎన్.ఎం -118 ,  కె.ఎన్.ఎం – 733, కె.ఎన్.ఎం -1638 రకాలు మంచి ఆదరణ పొందుతున్నాయి.

READ ALSO : kharif Rice varieties : ఖరీఫ్ సాగుకు అనువైన వరి రకాలు.. అందుబాటులో దీర్ఘ, మధ్య, స్వల్పకాలిక రకాలు

నాణ్యమైన విత్తనం, ఆరోగ్యవంతమైన  నారు, వరిలో అధిక దిగుబడికి  సోపానం.  మరి నారు పుష్ఠిగా పెరిగి, 25 నుండి 30 రోజుల్లో అందిరావాలంటే , విత్తనశుద్ది, పోషక యాజమాన్యం తప్పనిసరి  అని శాస్తవేత్తలు సూచిస్తున్నారు. ఖరీఫ్, రబీకి అనువైన ఈ రకాల గుణగణాల గురించి శాస్త్రవేత్త శ్రీధర్ రైతాంగానికి తెలియజేస్తున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు