Mahesh Babu : AI టెక్నాలజీ గురించి 2019 లోనే మహేష్ బాబు చెప్పాడా..? వీడియో వైరల్..!

Chat GPT అండ్ AI టెక్నాలజీ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాము. కానీ దాని గురించి మహేష్ బాబు ఎప్పుడో చెప్పాడు తెలుసా..?

Mahesh Babu said about Chat GPT and AI Technology in Maharshi movie

Mahesh Babu – AI Technology : ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వైపు అడుగులు వేయడం మొదలుపెడుతున్నారు. ఇప్పటికే పలు రంగాల్లో ఏఐ టెక్నాలజీ సేవలు కూడా మొదలు అయ్యాయి. ఈ క్రమంలోనే ప్రముఖ టెక్ దిగ్గజాలు సొంత ఏఐ టెక్నాలజీనే ఉపయోగిస్తున్నాయి. కొందరు ఈ టెక్నాలజీ గురించి గొప్పగా మాట్లాడుతున్నప్పటికీ, కొంతమంది మాత్రం హెచ్చరిస్తున్నారు. AI వల్ల మానవాళికి ఎప్పటికైనా ముప్పు తప్పదని, అది వినాశనానికి దారి తీస్తుందని ఎలన్ మస్క్‌ (Elon Musk) సహా టాప్ టెక్ సీఈఓలంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Gaddar in movies : పొడుస్తున్న పొద్దులా.. తెలుగు సినిమా తెరపై చిరస్మరణీయం గద్దర్ పాట

ఇక ఈ వాదనలు పక్కనబెడితే, ఈ టెక్నాలజీ ఈమధ్యనే ప్రపంచమంతటా అందుబాటులోకి వస్తుంది. అయితే దీని గురించి 4 ఏళ్ళ క్రిందటే మన మహేష్ బాబు చెప్పాడట. ఇప్పుడు అందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతుంది. మహేష్ హీరోగా 2019 లో తెరకెక్కిన ‘మహర్షి’ సినిమా మీ అందరికి గుర్తుకు ఉండే ఉంటుంది. ఆ సినిమాలో మహేష్.. అమెరికాలోని ఆరిజిన్ అనే పెద్ద కంపెనీకి సీఈఓగా కనిపిస్తాడు. ఆ మూవీ ఇంట్రడక్షన్ సీన్ లో మహేష్ ఏఐ టెక్నాలజీ గురించి మాట్లాడతాడు.

Bipasha Basu : ఆ సమయంలో నరకం అనుభవించాను అంటున్న బాలీవుడ్ హీరోయిన్ బిపాషా బసు..

అందుకు సంబంధించిన వీడియోని మహేష్ అభిమానులు షేర్ చేస్తూ.. Chat GPT అండ్ AI టెక్నాలజీ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాము. కానీ దాని గురించి సీఈఓ రిషి కుమార్ (మహర్షిలో మహేష్ పాత్ర పేరు) ఎప్పుడో చెప్పాడు అంటూ క్యాప్షన్స్ పెడుతున్నారు. మరి ఆ వీడియోని ఒకసారి మీరు కూడా చూసేయండి.

ఇక గుంటూరు కారం (Guntur Kaaram) విషయానికి వస్తే.. ఆగష్టు 9న మహేష్ పుట్టినరోజు ఉన్న సంగతి తెలిసిందే. ఆ రోజు మూవీ నుంచి ఫస్ట్ సింగల్ వచ్చే అవకాశం ఉందంటూ టాక్ వినిపిస్తుంది. మరి త్రివిక్రమ్ అండ్ టీం ఏమన్నా అప్డేట్ ఇచ్చి ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తారో లేదో చూడాలి.

 

 

ట్రెండింగ్ వార్తలు