2018 Movie : ఓటీటీకి వచ్చేసిన తరువాత కూడా చరిత్ర సృష్టించిన 2018.. మలయాళ ఇండస్ట్రీలోనే మొదటి..

మలయాళ సూపర్ హిట్ మూవీ 2018 ఓటీటీలోకి వచ్చేసిన తరువాత కూడా కలెక్షన్ల జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా ఈ సినిమా..

Malayala star Tovino Thomas 2018 Movie crossed 200 crores mark

2018 Movie : ఇటీవల మలయాళంలో రిలీజ్ అయిన 2018 మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని సంచలనం సృష్టించింది. 2018 లో కేరళలో వచ్చిన వరదలు నేపథ్యంతో ఈ సినిమాని తెరకెక్కించారు. మలయాళ స్టార్ హీరో టోవినో థామస్ (Tovino Thomas), అపర్ణ బాలమురళి, తన్వి రామ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాని జూడ్‌ ఆంథనీ జోసెఫ్‌ డైరెక్ట్ చేశాడు. కేవలం 15 కోట్లతో తెరకెక్కించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది.

Adipurush : హ‌నుమంతుడి ప‌క్క సీటు రేటుపై క్లారిటీ ఇచ్చిన మూవీ టీమ్‌.. ఎంతో తెలుసా..?

మలయాళ సినీ పరిశ్రమలో 100 కోట్లు తెచ్చిపెట్టిన సినిమాలంటే చేతి వేళ్ళపై లెక్కపెట్టి చెప్పొచ్చు. ఆ చిత్రాలు కూడా ఫుల్ రన్ సాధించడం తప్ప రోజులు వ్యవధిలో 100 కోట్ల మార్క్ ని అందుకోలేక పోయాయి. కానీ 2018 మూవీ కేవలం 10 రోజుల్లోనే 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. అది కూడా ఒక కేరళ రాష్ట్రంలోనే. అక్కడ సూపర్ హిట్టుగా నిలవడంతో.. ఆ చిత్రాన్ని ఇతర భాషల్లో కూడా డబ్ చేసి రిలీజ్ చేశారు. తెలుగులో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో రిలీజ్ అయిన ఈ చిత్రం.. భారీ లాభాలు తెచ్చిపెట్టింది.

Mahesh Babu : మహేష్ బర్త్ డే రోజు రాజమౌళి సినిమా లాంచ్.. ఆమిర్ ఖాన్ నటిస్తున్నాడా..?

ఇక 33 రోజులు థియేటర్ రన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ఇటీవలే ఓటీటీలోకి కూడా వచ్చేసింది. డిజిటల్ స్ట్రీమింగ్ తరువాత కూడా ఈ చిత్రం సంచలనం సృష్టించింది. తాజాగా ఈ సినిమా 200 కోట్ల మార్క్ ని అందుకుంది. మలయాళ సినీ పరిశ్రమలో 200 కోట్ల మార్క్ ని అందుకున్న తొలి సినిమాగా 2018 చరిత్ర సృష్టించింది. సినిమా బడ్జెట్ కంటే దాదాపు 6 రేట్లు ఎక్కువ కలెక్షన్స్ ని సాధించిన ఈ చిత్రం.. ఈ జోరుని ఇంకా కొనసాగిస్తుందేమో చూడాలి. త్వరలోనే మరికొన్ని భాషల్లో కూడా డబ్బింగ్ చేసి రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

ట్రెండింగ్ వార్తలు