Manish Sisodia-Delhi Liquor scam: 7 రోజుల ఈడీ కస్టడీకి మనీశ్ సిసోడియా

ఢిల్లీ లిక్కర్ స్కాం మనీలాండరింగ్ కేసులో ఏ1 నిందితుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను ఏడు రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ప్రత్యేక కోర్టు నిర్ణయం తీసుకుంది. అనంతరం సిసోడియాను అధికారులు ఈడీ ఆఫీసుకు తరలించారు. మనీశ్ సిసోడియాను 10 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని ఈడీ అధికారులు కోరగా, ఏడు రోజులకు మాత్రమే కోర్టు అనుమతి ఇచ్చింది.

Manish Sisodia-Delhi Liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కాం మనీలాండరింగ్ కేసులో ఏ1 నిందితుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను ఏడు రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ప్రత్యేక కోర్టు నిర్ణయం తీసుకుంది. అనంతరం సిసోడియాను అధికారులు ఈడీ ఆఫీసుకు తరలించారు. మనీశ్ సిసోడియాను 10 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని ఈడీ అధికారులు కోరగా, ఏడు రోజులకు మాత్రమే కోర్టు అనుమతి ఇచ్చింది.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ కేసులో మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్ పై ఇవాళ విచారణ జరగాల్సి ఉండగా, అది మార్చి 21కి వాయిదా పడింది. ఢిల్లీ లిక్కర్ స్కాం మనీలాండరింగ్ కేసులో మనీశ్ సిసోడియా నుంచి ఈడీ మరిన్ని విషయాలు రాబట్టనుంది. మనీశ్ సిసోడియాను ఈడీ నిన్న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో అరెస్టుల సంఖ్య ఇప్పటివరకు 12గా ఉంది. సిసోడియా ఈడీ అరెస్ట్ రిమాండ్ అప్లికేషన్ పైనే ప్రత్యేక కోర్టు ఇవాళ విచారణ జరిపింది. సిసోడియాపై ఉన్న అభియోగాలను ఈడీ తరఫు న్యాయవాదులు కోర్టుకు వినిపించి, కస్టడీలోకి ఇవ్వాలని కోరారు. దీంతో అందుకు కోర్టు అంగీకరించింది.

Delhi Liquor scam: చిరునవ్వుతో కోర్టుకు సిసోడియా.. విచారణలో ఎమ్మెల్సీ కవిత గురించి చెప్పిన ఈడీ.. పూర్తి వివరాలు

ట్రెండింగ్ వార్తలు