జాతీయ భద్రతా సలహాదారుగా మళ్లీ అజిత్ దోవల్‌

అజిత్ దోవల్‌ మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వాసాన్ని చూరగొన్నారు.

Ajit Doval: అజిత్ దోవల్‌ మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వాసాన్ని చూరగొన్నారు. జాతీయ భద్రతా సలహాదారుగా మరోసారి ఆయనను ప్రధాని మోదీ నియమించారు. ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీగా ప్రమోద్ కుమార్ మిశ్రాను కూడా కేంద్ర ప్రభుత్వం మళ్లీ నియమించింది. జూన్ 10 నుంచి ఈ నియామకాలు అమల్లోకి వస్తాయని ప్రభుత్వం ఈరోజు వెల్లడించింది. వీరిద్దరికీ క్యాబినెట్ హోదా కల్పించింది.

ప్రధాని కార్యాలయంలో ప్రధానమంత్రి సలహాదారులుగా అమిత్ ఖరే, తరుణ్ కపూర్‌లను కూడా రీఅపాయింట్ చేశారు. జూన్ 10 నుంచి రెండేళ్లపాటు వీరు పదవిలో కొనసాగుతారు. వీరిద్దరికీ కేంద్ర ప్రభుత్వ సెక్రటరీ హోదా కల్పించారు. తాజా నియామకాలను క్యాబినెట్ నియామకాల కమిటీ అధికారికంగా ఆమోదించింది.

Also Read: చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవం వేదికపై ఆసక్తికర ఘటన.. వీడియో వైరల్

ట్రెండింగ్ వార్తలు