RK Roja : ఎందుకు సిగ్గుపడాలి? మంచి చేసి ఓడిపోయాం.. : ఆర్కే రోజా సంచలన ట్వీట్!

RK Roja : చెడు చేసి ఓడిపోతే సిగ్గుపడాలి.. కానీ.. మంచి చేసి ఓడిపోయాం.. గౌరవంగా తలెత్తుకు తిరుగుదాం.. ప్రజల గొంతుకై ప్రతిధ్వనిద్దాం.. అంటూ మాజీ మంత్రి ఆర్కే రోజా ట్వీట్ చేశారు.

RK Roja Comments : ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అనూహ్యంగా ఓటమి పాలైంది. ఎన్నికల ఫలితాలకు ముందు చాలా వరకూ సర్వేల్లో సైతం అధికార వైసీపీకే విజయవకాశాలు ఉన్నాయని అంచనా వేశాయి. కానీ, ఎవరూ ఊహించనిరీతిలో అందరి అంచనాలు తారుమారయ్యాయి.

Read Also : పార్టీ అధిష్ఠానం ఏ పదవి ఇచ్చినా సరే..: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

151 సీట్లతో బలమైన ప్రత్యర్థిగా నిలిచిన వైసీపీ ఈసారి ఎన్నికల్లో 140 సీట్లను కోల్పోయింది. కేవలం 11 సీట్లకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో వైసీపీ ఓటమికి గల కారణాలను ఆ పార్టీ నేతలు విశ్లేషించుకుంటున్నారు. మాజీ సీఎం జగన్ కూడా పార్టీ ఓటమిపై స్పందించిన సంగతి తెలిసిందే. వైసీపీ మాజీ మంత్రులు, నేతలు సైతం ఇదే అంశంపై తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు.

తాజాగా మాజీ మంత్రి ఆర్కే రోజా కూడా వైసీపీ ఓటమిపై స్పందించారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్ (X) వేదికగా సంచలన ట్వీట్ చేశారు. చెడు చేసి ఓడిపోతే సిగ్గుపడాలి.. కానీ.. మంచి చేసి ఓడిపోయాం.. ఈ విషయంలో ఎందుకు సిగ్గుపడాలని ఆమె ప్రశ్నించారు.

గౌరవంగా తలెత్తుకు తిరుగుదాం.. ప్రజల గొంతుకై ప్రతిధ్వనిద్దాం..” అంటూ పార్టీ కార్యకర్తలకు రోజా పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో వైసీపీ రాష్ట్రంలో సమస్యలపై ఏ విధంగా ముందుకు వెళ్లనుంది? ప్రజల పక్షాన నిలబడి ఎలా పోరాటం చేయనుందో ఒక్కమాటలో చెప్పేశారు.

Read Also : నన్ను అవమానించిన డీజీపీ ఆఫీసుకు కచ్చితంగా వెళ్తా: హోం మంత్రి వంగలపూడి అనిత

ట్రెండింగ్ వార్తలు