ఇండియా కూటమి అడుగులు ఎటువైపు? రాహుల్ గాంధీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి?

నితీశ్ కుమార్ కూటమి నుండి వెళ్లకుండా ఉండి ఉంటే.. కాంగ్రెస్ ఇంకొన్ని ఎక్కువ స్థానాల్లో పోటీ చేసి ఉంటే.. చివరి నిమిషంలో టీడీపీ ఎన్డీయేలో చేరి ఉండకపోతే.. ఇప్పుడు రాజకీయాలు మరోలా ఉండేవి అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

I.N.D.I.A Alliance : సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి అధికారం సాధించలేకపోయినప్పటికీ.. దేశ రాజకీయాలపై ఇండియా కూటమి బలమైన ప్రభావం చూపింది. ఎన్నికలకు ముందు కొన్ని విబేధాలు తలెత్తినా.. కూటమిలో విభిన్న పార్టీలన్నీ కలిసికట్టుగా ముందుకు సాగి ఫలితాలు సాధించాయి. బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించలేకపోవడానికి ఇండియా కూటమి నేతలు కలిసికట్టుగా సాగించిన ప్రచారమే కారణం.

ఈ సంగతి పక్కన పెడితే, ఎన్నికలు ముగియడంతో ఇండియా కూటమి భవిష్యత్తు ఏంటి? అనేదానిపై అందరి దృష్టి నెలకొంది. కూటమి ఇలాగే కొనసాగుతుందా? లేక పార్టీలు విడిపోయి సొంత లక్ష్యాలతో పని చేసుకుంటాయా? లేక ప్రతిపక్షంగా కలిసికట్టుగా పోరాడతాయా? అన్నది రానున్న రోజుల్లో దేశ రాజకీయ స్థితిగతులను మార్చివేయనుంది.

అనుకున్న లక్ష్యం చేరుకోలేకపోయినప్పటికీ.. ఇండియా కూటమిని తక్కువ అంచనా వేయడానికి ఏమాత్రం వీల్లేదు. నితీశ్ కుమార్ కూటమి నుండి వెళ్లకుండా ఉండి ఉంటే.. కాంగ్రెస్ ఇంకొన్ని ఎక్కువ స్థానాల్లో పోటీ చేసి ఉంటే.. చివరి నిమిషంలో టీడీపీ ఎన్డీయేలో చేరి ఉండకపోతే.. ఇప్పుడు రాజకీయాలు మరోలా ఉండేవి అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

అయితే, గెలుపు అంచులో నిలబడటానికి, గెలవలేకపోవటానికి మధ్య చాలా తేడా ఉంది. ఈ తేడానే పార్టీలు, నేతల భవిష్యత్తును నిర్దేశిస్తుంది. మరి ఈ తేడా ఇండియా కూటమిని ఏం చేయబోతోంది? ప్రధాని అభ్యర్థిగా ప్రకటించకపోయినప్పటికీ, ఇండియా కూటమి ముఖచిత్రంగా మారిన రాహుల్ గాంధీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? అన్నది చాలా ఉత్కంఠ రేపుతోంది.

Also Read : మంత్రివర్గంలో సీనియర్లను పక్కన పెట్టిన చంద్రబాబు.. కారణం అదేనా?

పూర్తి వివరాలు..

ట్రెండింగ్ వార్తలు