Viral Video : చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవం వేదికపై ఆసక్తికర ఘటన.. అమిత్ షా నిజంగానే తమిళిసైని మందలించారా? వీడియో వైరల్!

Viral Video : కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ నేత, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను మందలించినట్లుగా కనిపించే వీడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో వివాదానికి దారితీసింది.

Viral Video : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవం వేదికపై ఆసక్తికర సన్నివేశం అందరి దృష్టిని ఆకర్షించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ నేత, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను మందలించినట్లుగా కనిపించే వీడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో వివాదానికి దారితీసింది. ఆ వీడియోలో అమిత్ షాను తమిళిసై పలకరిస్తున్నట్లు కనిపిస్తోంది. బీజేపీ పెద్దలందరికి తమిళసై అభివాదం చేస్తు వస్తున్న సమయంలో అమిత్‌షా ఆమెను దగ్గరికి పిలిచి వేలు చూపించి ఏదో సీరియస్‌గా మాట్లాడినట్టుగా ఉంది.

Read Also : Ambati Rayudu : సీఎంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను చూడాల‌నేది నా క‌ల‌.. ఇంకో అడుగు దూర‌మే : అంబ‌టి రాయుడు

ఈ వీడియోపై స్పందించిన నెటిజన్లు తమిళసైతో అమిత్ షా ఏం మాట్లాడి ఉంటారు అనేదానిపై ప్రశ్నలను లేవనెత్తారు. ఇటీవల తమిళనాడు బీజేపీలో ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షుడు కె అన్నామలై, తమిళిసై సౌందరరాజన్ మద్దతుదారుల మధ్య జరిగిన అంతర్గత పోరుతో ఈ సంఘటనతో మరికొందరు ముడిపెడుతున్నారు.

ఈ వివాదం తమిళనాడు అధికార పార్టీ డీఎంకే దృష్టిని కూడా ఆకర్షించింది. డీఎంకే అధికార ప్రతినిధి శరవణన్ అన్నాదురై.. ‘ఇది ఎలాంటి రాజకీయం?’ ప్రముఖ మహిళా రాజకీయవేత్తను ఇలా బహిరంగంగా మందలించడం ఏం మర్యాద? ఇది అందరూ చూస్తారని అమిత్ షా తెలుసుకోవాలని హితువు పలికారు.

తమిళనాడులో లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె. అన్నామలై, తమిళిసై సౌందరరాజన్‌ల మధ్య విభేదాలు తలెత్తాయనే పుకార్లు దీనికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. రాష్ట్రంలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడంతో అసలు వివాదం మొదలైంది. పార్టీ కార్యకర్తలు ఓటమికి అన్నామలైనే కారణమని ఆరోపించారు. అన్నామలై వ్యవహారశైలి బీజేపీతో ఏఐఏడీఎంకే బంధాన్ని తెంచుకోవడానికి దారితీసిందని, ఫలితంగా పార్టీకి గణనీయమైన నష్టాలు వాటిల్లాయని భావిస్తున్నారు.

ఎఐఎడీఎంకే నేత, రాష్ట్ర మాజీ మంత్రి ఎస్‌పీ వేలుమణి, ఎన్నికలకు ముందు బీజేపీ నుంచి వైదొలగడాన్ని అన్నామలై విమర్శించారు. చెన్నై సౌత్ సీటులో పోటీ చేసి ఓడిపోయిన తమిళిసై కూడా పొత్తు కొనసాగితే.. బీజేపీ-ఏఐఏడీఎంకే ఫ్రంట్ 35 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని కూడా సమర్థించారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఎన్నికల పరాజయంపై ఆమె అన్నామలైపై విరుచుకుపడ్డారు. ఆన్‌లైన్‌లో తమిళిసైని కించపరిచిన అన్నామలై మద్దతుదారులకు ఇది అంతగా నచ్చలేదు.  ఇప్పడు, తమిళసైపై  మద్దతుదారులు కూడా సోషల్ మీడియాలో బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఈ వీడియో క్లిప్‌పై తమిళిసై సౌందరరాజన్ ఇంకా స్పందించలేదు.

Read Also : హోంమంత్రి ఎవరు? ఆర్థిక శాఖ ఎవరికి? పవన్‌కు ఇచ్చే పదవి ఏది? మంత్రులకు కేటాయించే శాఖలపై ఉత్కంఠ

ట్రెండింగ్ వార్తలు